
‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘దొంగ నా కొడుకు’పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘దొంగ నా కొడుకు’ సినిమా నవంబర్ 13, 2026న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ పోస్టర్ కూడా మంచి కామెడీ టచ్‌తో ఆకట్టుకుంటోంది.
పోస్టర్‌లో మౌళి సోఫాలో కూర్చుని టెన్షన్‌తో, భయపడినట్టుగా కనిపిస్తున్నాడు. అతడి వెనుక అలీ, రజిత కనిపిస్తున్నారు. సినిమాలో మౌళికి తల్లిదండ్రులుగా వీరిద్దరూ నటిస్తున్నారు. రజిత సీరియస్‌గా మౌళి వైపు చూపిస్తుండగా.. అలీ తన ఎక్స్‌ప్రెషన్‌తో కామెడీని పండిస్తున్నాడు. ఈ మూడు పాత్రల మధ్య ఉన్న సన్నివేశం చూస్తుంటే సినిమా మొత్తం కుటుంబ నేపథ్యంలోని హాస్యంతో సాగనుందని అర్థమవుతోంది.
డెబ్యూ దర్శకుడు శ్రీను కంబాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఓ కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో ఆసక్తిని పెంచిన చిత్రబృందం.. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది.
సినిమాలో సుస్మిత శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, రఘుబాబు, ప్రియ, గుండు సుధర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ యెర్నేని కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సింజిత్ యెర్రమిల్లి సంగీతం సమకూరుస్తుండగా, శ్రీధర్ సోంపల్లి ఎడిటర్‌గా, నాగేంద్ర గువ్వల ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
మౌళి, అలీ, రజిత కాంబినేషన్‌లో వచ్చే ఫ్యామిలీ కామెడీ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. మరి ఈ కొత్త తరహా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే నవంబర్ 13 వరకు వేచి చూడాల్సిందే.
