Download App

నిన్ను స్వీటీ అని పిలవాలా? ఘాటీ అనాలా…? వైరల్ అవుతున్న అనుష్క-బన్నీ ఫోన్ కాల్

సెప్టెంబర్ 4, 2025 • By Srinivas
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అనుష్క పవర్‌ఫుల్ మాస్ రోల్‌లో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్‌ ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటివరకు అనుష్క నటించిన పాత్రల కంటే భిన్నంగా, ఫుల్...
నిన్ను స్వీటీ అని పిలవాలా? ఘాటీ అనాలా...? వైరల్ అవుతున్న అనుష్క-బన్నీ ఫోన్ కాల్

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అనుష్క పవర్‌ఫుల్ మాస్ రోల్‌లో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్‌ ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటివరకు అనుష్క నటించిన పాత్రల కంటే భిన్నంగా, ఫుల్ మాస్ యాక్షన్ షేడ్స్‌తో కనిపించనున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో ప్రత్యేక హంగామా చేయనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రమోషన్స్‌లో కొత్త ట్రెండ్

‘ఘాటి’ ప్రమోషన్స్ విషయంలో అనుష్క కొత్త ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. సాధారణ ప్రమోషనల్ ఈవెంట్స్ కాకుండా, ఆడియో ప్రమోషన్స్ ద్వారా సినిమాపై ఆసక్తిని పెంచడం మొదలుపెట్టింది. తాజాగా అనుష్క చేసిన ప్రమోషన్ మాత్రం పూర్తిగా స్పెషల్‌గా మారింది.

బన్నీతో అనుష్క ఫోన్ సంభాషణ

తాజాగా విడుదలైన ప్రోమోలో, అనుష్క నేరుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలుపుకొని ప్రమోషన్ చేసింది. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. నిన్ను స్వీటీ అని పిలవాలా? ఘాటీ అని పిలవాలా అని అడుగుతాడు అల్లు అర్జున్ అనుష్కని. ఇందులో బన్నీ, అనుష్క చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ గురించి ప్రస్తావిస్తూ, ఆమె మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే శక్తి ఉన్న నటి అని ప్రశంసించాడు. అలాగే ‘ఘాటి’లోని శీలావతి పాత్ర కూడా ఆమె కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఘాటి బజ్

అల్లు అర్జున్ చేసిన ఈ ప్రమోషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ కాకుండా సినీ ప్రేక్షకుల మధ్య కూడా ‘ఘాటి’పై బజ్ పెరిగింది. అనుష్క – బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఆడియో సంభాషణ సినిమాకి మాస్ కనెక్ట్ తెచ్చి పెట్టిందని ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ‘ఘాటి’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. క్రిష్ దర్శకత్వం, అనుష్క మాస్ రోల్, బన్నీ చేసిన ప్రమోషన్ – ఈ మూడు అంశాలు కలిసిపోవడంతో సినిమాపై ప్రేక్షకులలో ఎక్సైట్మెంట్ మరింత పెరుగుతోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading