Download App

చిన్న సినిమాలకు… చిన్న థియేటర్స్ వస్తున్నాయా…?

మార్చి 10, 2026 By Suresh Thota
థియేటర్స్ విషయంలో పురుడు పోసుకుంటున్న కొత్త ఆలోచనలు…. అవును నిజమే మీరు వింటున్నది… సింగిల్ ధియేటర్ లానే… 100 సీటింగ్ కెపాసిటీ తో సినిమా థియేటర్స్ రాబోతున్నాయి. ఒక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ టాలీవుడ్, బాలీవుడ్, మిగతా రాష్ట్రాలకు చెందిన సీనియర్ ప్రొడ్యూసర్స్ , డిస్ట్రిబ్యూటర్ల ను...

థియేటర్స్ విషయంలో పురుడు పోసుకుంటున్న కొత్త ఆలోచనలు…. అవును నిజమే మీరు వింటున్నది… సింగిల్ ధియేటర్ లానే… 100 సీటింగ్ కెపాసిటీ తో సినిమా థియేటర్స్ రాబోతున్నాయి.

ఒక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ టాలీవుడ్, బాలీవుడ్, మిగతా రాష్ట్రాలకు చెందిన సీనియర్ ప్రొడ్యూసర్స్ , డిస్ట్రిబ్యూటర్ల ను టచ్ చేసినట్లు గా తెలుస్తుంది.

భారతదేశం లో ఎక్కువగా… అంటే మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం… ఇక్కడ వ్యవసాయ రంగం మీద ఆధారపడే ప్రజలు ఎక్కువ… అందుకే….. ఇక్కడ జానపద సాహిత్యం, కళలు, అనాదిగా రాజుల కాలం నుండి ఆదరించబడ్డాయి. తదనంతర కాలం లో నాటకరంగం స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలను, జాగృత పరచి స్వతంత్ర భారత సంగ్రామంలో ప్రతి ఒక్కరిని కార్యోన్ముఖులను చేసింది. అలా నాటక రంగం నుండి సినిమా పరిశ్రమ వరకు బాటలు వేసింది.

ఉదయం నుండి కష్ట పడ్డ ప్రజలకు సాయంత్రం వేళ కష్టాన్ని మైమరపించే విధంగా సినిమాలు ఉండేవి. కాలం తో వచ్చిన మార్పులతో సినిమా పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందినది. దేశం లో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రమారమి 2800 థియేటర్స్ ఉండేవి అని పాత గణాంకాలు చెబుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉండేది.

ఇప్పుడు థియేటర్ ల సంఖ్య చాలా తగ్గిపోయింది. వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం తో… “సినిమా”… థియేటర్స్ నుండి ప్రేక్షకుల చేతిలోకి వచ్చేసింది. సినిమా హాల్స్ లో రేట్లు అధికంగా ఉండటం… సింగిల్ స్క్రీన్ లు తగ్గిపోవడం… OTT లోకి రిలీజ్ అయినా నెల నుండి రెండు నెలల్లో విడుదల కావడం…. సింగిల్ థియోటర్ నిర్వహణ భారంగా మారడంతో కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి. ఈ పాపం “తిలా పాపం తలా పిడికెడు” అన్నట్లుగా అందరికీ వర్తిస్తుంది.

ఇప్పుడు థియేటర్ కి జనాన్ని తీసుకొచ్చే విధంగా ఒక MNC కంపెనీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తుంది అన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అన్ని చోట్లా మల్టీ ఫ్లెక్స్ లు కట్టేస్తున్నారు. రేట్లు, విశ్రాంతి సమయంలో పాప్ కార్న్… రేట్లు అధికంగా ఉండడం తో సినీ ప్రేమికులు తగ్గిపోతున్నారు. వీరిని ఆకర్షించేవిధంగా 100 మెంబెర్స్ కెపాసిటీతో సినిమా థియేటర్స్ కు రూపకల్పన చేయబోతున్నారు అని తెలుస్తుంది. దీనికి ప్రభుత్వం నుండి కూడా సహకారం ఉండేటట్లుగా, సంప్రదించనున్నారని తెలుస్తుంది. అంటే ఒక మోస్తరు కాలనీలలో కూడా ఈ చిన్న థియోటర్ లు వచ్చేస్తాయి. ఇందులో చాలా రకాలుగా ప్లాన్స్ ను రూపొందించే కార్యాచరణ జరుగుతుంది అని ఒక సీనియర్ ప్రొడ్యూసర్ వ్యాఖ్యానించారు.

ఇది కనుక ఆచరణ లోకి వస్తే….. పెద్ద మల్టీ ఫ్లెక్స్ కి ఆదరణ ఎలా ఉంటుందో అని కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ చిన్న థియేటర్లలో 120 నుండి 150 రూపాయలు వరకు మాత్రమే రేట్లు ఉండేట్లుగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది… వేచి చూద్దాం… ఇది జరిగితే సినిమాకి సగటు మధ్య తరగతి ప్రేక్షకుడు దగ్గర అవుతాడేమో చూద్దాం.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading