
‘మా ఊరి పొలిమేర’, ‘పొలిమేర 2’తో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్న మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ఇప్పుడు మూడో భాగంతో మరింత భారీగా రాబోతోంది. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొలిమేర 3’లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 15న అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్ర పేరును రివీల్ చేస్తూ మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు.
వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఘనంగా ప్రారంభమైన ‘పొలిమేర 3’లో అర్జున్ సర్జా ఎంట్రీనే అతిపెద్ద సర్‌ప్రైజ్‌గా నిలిచింది.
ఈ సినిమాలో అర్జున్ ‘విరావి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అర్జున్ ముఖాన్ని చూపించకుండా.. కండలు తిరిగిన చేతిపై ఉన్న టాటూలను హైలైట్ చేశారు. ఒకవైపు పరమశివుని త్రిశూలం, మరోవైపు శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం టాటూలుగా కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే అర్జున్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

‘బ్లాస్ట్ జోన్’తో ఇటీవల విజయాన్ని అందుకున్న అర్జున్ సర్జా.. ఇప్పుడు ‘పొలిమేర’ యూనివర్స్‌లోకి అడుగుపెడుతుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆయన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ‘విరావి’ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ‘పొలిమేర 3’ కథ విషయానికి వస్తే.. గత రెండు భాగాల్లో కనిపించిన మిస్టరీ, సస్పెన్స్‌కు మరింత డార్క్ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌ను జోడించనున్నట్లు సమాచారం. ఊహించని ట్విస్టులు, షాకింగ్ రివిలేషన్స్‌తో ఈ ఫ్రాంచైజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు దర్శకుడు అనిల్ విశ్వనాథ్ భారీ స్క్రీన్‌ప్లేను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తొలి రెండు భాగాల్లో ఐకానిక్ కొమురయ్య పాత్రలో మెప్పించిన సత్యం రాజేష్ మూడో భాగంలోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. కామాక్షి భాస్కర్లకు కూడా కథలో కీలకమైన పాత్ర ఉంది. గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ తారాగణం, మిస్టరీ, డార్క్ సూపర్‌నేచురల్ అంశాలు, అర్జున్ సర్జా పవర్‌ఫుల్ ఎంట్రీతో ‘పొలిమేర 3’పై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ‘విరావి’గా అర్జున్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే విషయంపై ఇప్పుడు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. త్వరలో విడుదల కానున్న ఆయన ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
