సినిమా వార్తలు

‘బాహుబలి ది ఎపిక్’ రీ-రిలీజ్: మహేష్ బాబు #SSMB29 కోసం రాజమౌళి వ్యూహాత్మక అడుగా?

Published by
Rahul N

స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫార్మ్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న “బాహుబలి ది ఎపిక్” ను మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం ఎందుక ని నెట్ జెన్స్ ప్రశ్నిస్తున్నారు. దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఈ నిర్ణయంతో మరింత పెద్ద లక్ష్యాన్ని ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. మహేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న తన తదుపరి SSMB29 Globe Trotter సినిమాకు ముందు, RRR ద్వారా తన ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ ప్రేక్షకులకు ఆయన మునుపటి చిత్రం బాహుబలిని రెండు భాగాలను అందరు కొత్తగా వీక్షించాలన్నది రాజమౌళి ఉద్దేశం లాగా అనిపిస్తుంది.

ఈ కొత్త వెర్షన్‌లో రెండు భాగాలుగా వచ్చిన అసలు బాహుబలి సాగా కు చెందిన ఐదు గంటల నిమిషాల రన్‌ టైమ్‌ ను 225 నిమిషాలకు (3 గంటల 45 నిమిషాలకు) కుదించారు. రాజమౌళి Baahubali The Epic థియేటర్ లో విడుదలైన వెర్షన్ లో మూడు పాటలు, పునరావృత సన్నివేశాలను తొలగించారు. అయినప్పటికీ, కథా హృదయం మరియు భావోద్వేగ పునాదులు యథాతథంగా నిలిచాయి. రాజదర్బార్‌ లో జరిగిన శిరోఛ్ఛేదన సన్నివేశం, కట్టప్ప ధ్రోహం, ప్రభాస్-అనుష్కల తూటాల సీక్వెన్స్ ఇప్పటికీ రోమాంచిత అనుభూతిని కలిగిస్తాయి.

అయితే, ఈ ఎడిట్ కట్ పూర్తిగా ఆకట్టుకునేలా లేదు. సమయం తగ్గించినప్పటికీ, కొన్నిచోట్ల సినిమాను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అభిమాని దృష్టిలో ఇది నాస్టాల్జిక్ జర్నీగా అనిపించినా, సాధారణ ప్రేక్షకులకు ఇది కొత్త అనుభవం కంటే రీక్యాప్‌ లా ఉంటుంది.

విజువల్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే, 2015లో సంచలనం సృష్టించిన కొన్ని గ్రాఫిక్స్ ఇప్పుడు పాతబడినట్లు గా అనిపిస్తాయి. ముఖ్యంగా, హిమపాతం సన్నివేశం అనుకోకుండా హాస్యాన్ని కలిగిస్తుంది. అయితే, “మనోహరి” వంటి సాంగ్ తొలగించడం సానుకూల అంశం.

ప్రభాస్ పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్, అనుష్క శెట్టి యొక్క గంభీరమైన పాత్ర ఈ చిత్రానికి ప్రాణం పోస్తాయి. రాజమౌళి కథనం ఇప్పటికీ అద్భుతంగా ఉన్నప్పటికీ, ఈ కాలపు ప్రేక్షకుల దృష్టిలో అదే మంత్రముగ్ధతను అందించలేకపోతుంది.

మొత్తంగా, “బాహుబలి ది ఎపిక్” రాజమౌళి తన గత వైభవాన్ని, భవిష్యత్తు SSMB29 గ్లోబల్ ప్రయాణానికి బ్రిడ్జ్‌గా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.

Rahul N