జనవరి 7న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
జనవరి 5, 2026 Published by Srinivas

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తిపై అంచనాలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. క్లాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్‌లకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సంక్రాంతి బరిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
SLV Cinemas బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే మంచి హైప్ తీసుకొచ్చింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ను ప్రకటించారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 7వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
రవితేజ మార్క్ ఎనర్జీకి కిశోర్ తిరుమల క్లాస్ టచ్ జతకావడంతో ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా నిలవబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయని టాక్. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

ముఖ్యంగా రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతిల మధ్య వచ్చే లవ్ ట్రయాంగిల్ సన్నివేశాలు నవ్వులు పూయిస్తూ ఆకట్టుకున్నాయి. జనవరి 7న విడుదల కానున్న ట్రైలర్‌లో కథలోని కీలక ట్విస్టులు, రవితేజ పండించే కామెడీ స్థాయి ఏ రేంజ్‌లో ఉండబోతోందన్నది స్పష్టత ఇవ్వనుంది.
సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ‘వామ్మో వాయ్యో’ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. రవితేజ మేనరిజమ్స్, ఎనర్జిటిక్ స్టెప్పులు ఈ పాటను ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మార్చాయి.
భోగి పండుగ కానుకగా జనవరి 13న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు మరింత గ్రాండ్ లుక్‌ను తీసుకొచ్చాయి.
“ఇది కేవలం మాస్ సినిమా మాత్రమే కాదు… ప్రతి కుటుంబం కలిసి ఆస్వాదించే క్లీన్ ఎంటర్టైనర్” అని చిత్ర బృందం పూర్తి నమ్మకంతో చెబుతోంది.
