సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూలీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఆయన నిర్మిస్తున్న లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో మరో ప్రతిష్టాత్మక చాప్టర్‌గా నిలవబోతోంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో, ఇటీవల కుబేరతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో అలరించనున్నారు. ఉపేంద్ర, శ్రుతీ హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, మహేంద్రన్ వంటి స్టార్ నటీనటులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ రోజు మేకర్స్ ఒక బిగ్ అప్డేట్ అందించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కూలీ ట్రైలర్‌ను ఆగస్ట్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర పవర్‌ఫుల్ లుక్స్‌లో మెరిసిన ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలో) ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్‌గా విడుదల చేయనుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు, చికిటు, మోనికా వంటి పాటలు సోషల్ మీడియాలో దుమ్మురేపి సినిమాపై భారీ క్రేజ్‌ను క్రియేట్ చేశాయి.
కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఆనిరుధ్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
భారీ అంచనాలతో రూపొందుతున్న కూలీ 2025 ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.