యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా కోసం ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి కనిపిస్తోంది. టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన 24 గంటల్లోనే 30 వేల టికెట్లు అమ్ముడవ్వడం ఈ చిత్రంపై ఉన్న హైప్‌కు నిదర్శనం. దీంతో బుకింగ్ ప్లాట్‌ఫాంలలో కింగ్డమ్ ట్రెండింగ్‌లో నిలుస్తూ టాప్ ప్లేస్ దక్కించుకుంది.
ఓవర్సీస్‌లో కూడా ప్రీ-సేల్స్ జోరుగా కొనసాగుతుండటంతో, మేకర్స్ మరింత పెద్ద ఎత్తున ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 30న ప్రత్యేక ప్రీమియర్స్ జరగనున్నాయి.
ఇటీవల విడుదలైన కింగ్డమ్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంగా సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కథా పటిమతో పాటు యాక్షన్, ఎమోషనల్ డోస్‌తో మరింత ఆసక్తిని రేపుతోంది.
ఈ సినిమా కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు విజయ్ దేవరకొండ. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.
కింగ్డమ్ హైప్ చూస్తుంటే, విడుదల రోజున భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.