యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అయాన్ ముఖర్జీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ‘వార్ 2’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది.
తాజాగా దర్శకుడు అయాన్ ముఖర్జీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆవన్ జావన్’ గురించి అప్డేట్ ఇచ్చారు. హృతిక్ రోషన్ – కియారా అద్వానీపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ ట్రాక్‌ను ప్రీతమ్ సంగీతం సమకూర్చగా, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ రాయగా, అరిజిత్ సింగ్ తన గాత్రంతో మాయ చేయబోతున్నారు.
‘బ్రహ్మాస్త్ర’లోని కేసరియాలా ఈ పాట కూడా భారీ హిట్ అవుతుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఈ వారం లోపలే ఈ పాటను విడుదల చేయనున్నట్టు సమాచారం.
భారీ యాక్షన్, ఎమోషన్‌తో రూపొందిన ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.