Download App

Nadeem Khan: ‘దురంధర్’ చిత్రంలోనే కాదు… నిజ జీవితంలో కూడా!

జనవరి 26, 2026 By Suresh Thota
బాలీవుడ్ చిత్రం 'దురంధర్'లో ఇండియాలో కనక వర్షం కురిపించిన సంగతి తెలిసిందే… అందులో అక్షయ్ ఖన్నా దగ్గర వంటవాడిగా, నమ్మకస్తుడిగా నటించి, వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్లో నటించిన నదీమ్ ఖాన్, నిజ జీవితంలో కూడా ఒక అమ్మాయిని లొంగదీసుకుని, నమ్మించి మోసం చేశాడని, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో...
Nadeem Khan: 'దురంధర్' చిత్రంలోనే కాదు… నిజ జీవితంలో కూడా!

బాలీవుడ్ చిత్రం ‘దురంధర్’లో ఇండియాలో కనక వర్షం కురిపించిన సంగతి తెలిసిందే… అందులో అక్షయ్ ఖన్నా దగ్గర వంటవాడిగా, నమ్మకస్తుడిగా నటించి, వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్లో నటించిన నదీమ్ ఖాన్, నిజ జీవితంలో కూడా ఒక అమ్మాయిని లొంగదీసుకుని, నమ్మించి మోసం చేశాడని, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు.

ఈ కేసుకు సంబంధించిన ప్రధాన వివరాలు ఇలా ఉన్నాయి… పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వశ పరచుకుని గత 10 సంవత్సరాలుగా తనను లైంగికంగా వేదించి, ఇప్పుడు పెళ్లి చేసుకోనని మోసం చేశాడని… ఒక 41 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి కథనం ప్రకారం, 2015లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, తాజాగా అతను పెళ్లికి నిరాకరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలు మొదట వర్సోవా పోలీసులను ఆశ్రయించడంతో, వారు ‘జీరో ఎఫ్ఐఆర్’ (ZERO FIR) గా కేసు నమోదు చేశారు. (ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ప్రాథమిక ఫిర్యాదు చేయవచ్చు). అయితే, అసలు నేరం జరిగిన ప్రాంతం మాల్వాని పరిధిలోకి వస్తుంది కాబట్టి, తదుపరి విచారణ మరియు నిందితుడిని అరెస్ట్ చేసే ప్రక్రియ కోసం కేసును మాల్వాని పోలీసులకు బదిలీ చేశారు. పోలీసులు ప్రస్తుతం ఈ ఆరోపణలు, ఎంతవరకు నిజమనేది నిర్ధారించే క్రమంలో ఉన్నారు. బాధితురాలి మెడికల్ రిపోర్టులు మరియు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.

బాధితురాలు గతంలో పలువురు సినీ నటుల వద్ద పనిమనిషిగా పనిచేసింది. ఆ క్రమంలోనే 2015లో నదీమ్ ఖాన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. జనవరి 22, 2026 న పోలీసులు నదీమ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతనికి ప్రాథమికంగా పోలీస్ కస్టడీ విధించింది.

నదీమ్ ఖాన్ ఇటీవల ‘ధురంధర్’ సినిమాలో అఖ్లాక్ (వంటవాడు) అనే పాత్రలో నటించారు.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading