Download App

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్: ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్‌తో మాస్ జాతర మొదలు

మార్చి 27, 2026 By Srinivas
మెగా పవర్ స్టార్ Ram Charan ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం Peddi నుంచి “పెద్ది పహిల్వాన్” గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని కూడా పురస్కరించుకుని వచ్చిన ఈ గ్లింప్స్ అభిమానులకు పవర్‌ఫుల్ ట్రీట్‌గా మారింది....
రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్: ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్‌తో మాస్ జాతర మొదలు

మెగా పవర్ స్టార్ Ram Charan ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం Peddi నుంచి “పెద్ది పహిల్వాన్” గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని కూడా పురస్కరించుకుని వచ్చిన ఈ గ్లింప్స్ అభిమానులకు పవర్‌ఫుల్ ట్రీట్‌గా మారింది. దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు.

“కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట” అనే పవర్‌ఫుల్ వాయిస్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. వెంటనే విజువల్స్ ప్రేక్షకులను కుస్తీ రంగంలోకి తీసుకెళ్లి, దుమ్ము, చెమట, పోరాటస్ఫూర్తి నిండిన ప్రపంచాన్ని చూపిస్తాయి. కఠినమైన శిక్షణ, ఇటుక గోడలెక్కడం, ఇసుక సంచులు ఎత్తడం వంటి సన్నివేశాలు “పెద్ది పహిల్వాన్” ఎదుగుదలను బలంగా ప్రతిబింబిస్తాయి.

రామ్ చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. సిక్స్ ప్యాక్, బలమైన కండరాలు, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో నిజమైన పహిల్వాన్‌లా ఒదిగిపోయారు. గదను పట్టుకుని హనుమంతుడిలా కనిపించిన షాట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, శ్రీరామ నవమి ఉత్సాహానికి సరిగ్గా సరిపోయింది. “చూడుమే… ఆటే నా పోగరు…” అనే ఫైనల్ డైలాగ్ మాస్ ఆడియన్స్‌కు పక్కా హై ఇచ్చేలా ఉంది.

దర్శకుడు బుచ్చి బాబు సానా, చరణ్‌ను కొత్త కోణంలో చూపిస్తూ గూస్‌బంప్స్ కలిగించే ట్రీట్ ఇచ్చారు. ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే ఎనర్జీ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది.

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్: ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్‌తో మాస్ జాతర మొదలు

టెక్నికల్‌గా కూడా గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఆర్. రత్నవేలు కెమెరా వర్క్ కుస్తీ ప్రపంచంలోని ఇంటెన్సిటీని అద్భుతంగా పట్టుకుంది. A. R. Rahman అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల ప్రభావాన్ని మరింత పెంచింది. నవీన్ నూలి ఎడిటింగ్ షార్ప్‌గా ఉండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ప్రతి ఫ్రేమ్‌ను గ్రాండ్‌గా తీర్చిదిద్దింది.

ఈ చిత్రంలో Janhvi Kapoor కథానాయికగా నటిస్తుండగా, Shiva Rajkumar, Jagapathi Babu, Divyendu Sharma, Boman Irani కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ గ్లింప్స్ రామ్ చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మరింత గ్రాండ్‌గా మార్చడమే కాకుండా, “పెద్ది పహిల్వాన్” రూపంలో ఒక ఫెరోషియస్ ఫోర్స్ రాబోతుందనే సంకేతాన్ని ఇస్తోంది. “పెద్ది” చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading