సినిమా వార్తలు

‘వారణాసి’ సినిమాతో చిన్నమస్తా దేవిపై మళ్ళీ మొదలైన చర్చ…

Published by
Rahul N

‘వారణాసి’ టైటిల్ ఈవెంట్ తర్వాత ఎక్కడ చూసినా ఈ సినిమాపై చర్చ జరుగుతుంది. ఈవెంట్లో రాజమౌళి దేవుడ్ని నమ్మను అని అనడం… హనుమంతుడిపై కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియా లో రచ్చ రచ్చ అవుతోంది. మరి దేవుడ్నినమ్మని వాడివి హనుమంతుడిని, చిన్న మస్తా దేవిని నీ సినిమాలలో ఎలా ఉపయోగించుకుంటున్నావు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

‘బాహుబలి’ సినిమాలో శివ లింగానికి అనునిత్యం అభిషేకం చేయడానికి ప్రభాస్ తల్లి చాలా దూరం నుండి నీటిని తెస్తూ ఇబ్బంది పడుతుంది. దానిని చూసిన ప్రభాస్ ఏకంగా శివలింగంనే పెకలించుకుని వచ్చి పారుతున్న నీటి కింద ప్రతిష్ట చేస్తాడు. అప్పుడు అక్కరకు వచ్చిన హిందూ మతం… ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం మూలంగా కొంత సమయం ప్లే కాకపోవడంతో అసహనానికి లోనై దేవుడిపై కామెంట్స్ చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక చిన్నమస్తా దేవీని ఈ చిత్రంలో ఉపయోగించడాన్ని ప్రశ్నిస్తున్నారు.

దశమహ విద్యలలో అత్యంత శక్తి వంతమైంది ఈ అమ్మవారు. ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాం.

ఆవిడ రతి మన్మధుల పైన తన కాలు ఉంచి నిలవడం మీద ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. మామూలు రతి, విపరీత రతి అని రెండు రకాలు. అమ్మవారి పాదాల వద్ద విపరీత రతి భంగిమలో ఉన్న వాళ్ళ మీద అమ్మవారు…. తన కాలి ముని వేళ్ళను మాత్రమే తాకిస్తుంది. మామూలు రతి అనగా పురుషుడు పైన ఉండడం…. విపరీత రతి అనగా స్త్రీ పైన ఉండడం….అది మంచిది కాదు…. అని చెప్పడమే అమ్మవారి తత్వం…. అందుకే అమ్మవారు తన కాలిమునివేళ్ళతో అదిమి పట్టి ఉంచినట్టుగా మనం అమ్మవారి చిత్రాలలో కానీ…. విగ్రహాలలో కానీ చూడవచ్చు.

మానవ శరీరం లో మూడు ముఖ్యమైన నాడులు ఉంటాయి. ఇడ, పింగళ , సుషుమ్న ఈ నాడులకు సంకేత రూపమే అమ్మవారి నుండి వెలువడే మూడు రక్తపు దారలు. ఉచ్వాస, నిశ్వాసాలకి ఇడ , పింగళ లకు డాకిని , వర్ణిని వర్ణిస్తారు. రెండు రక్తపు దారలను వీరు స్వీకరిస్తుండగా…. మూడవ దార ను సుషుమ్న ను పర్వత రాజు “విరోచనుడు” కుమార్తె అయిన “చిన్న మస్తా” దేవి స్వీకరిస్తుంది…. ఈమెనే “వజ్ర వైరోచిని దేవీ” గా కొలుస్తారు.

అస్సాం , అరుణాచలప్రదేశ్ లలో…. ముఖ్యమైన ఆలయం ఛత్తీస్ ఘడ్ లో “రాజ రప్ప” లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లోని త్రిపురాంతకం లో కూడా ఉంది….ఈమెనే ప్రచండ చండిక, రేణుకా దేవి గా కూడా కొలుస్తారు.

“వారణాసి” లో అఘోరాలు, నాగ భైరవులు, తాంత్రిక సాధన చేసేవారు, ఈ అమ్మవారి కృప కోసం విపరీతమైన సాధన చేస్తారు.

Rahul N