సినిమా వార్తలు

దూసుకుపోతున్న రాంచరణ్ ‘చికిరి చికిరి’ సాంగ్… షాకింగ్ వ్యూస్, లైక్స్ …

Published by
Srinivas

రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రానికి మొదటగా విడుదలైన ఫస్ట్ షాట్ మరియు గ్లింప్స్ కు సోషల్ మీడియాతో పాటు, అభిమానుల నుండి భారీ స్పందన లభించింది. గ్రామీణ నేపథ్యం, చరణ్ లుక్, మరియు బుచ్చి బాబు సన దర్శకత్వంలో కనిపించిన కఠోరమైన స్పోర్ట్స్‌ అట్టిట్యూడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గరినుంచే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఇప్పుడేమో అదే హైప్‌ను రెట్టింపు చేస్తూ ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ‘చికిరి చికిరి’ సాంగ్ సోషల్ మీడియా అంతా దుమ్ములేపుతోంది. తెలుగుతో పాటు హిందీ మరియు ఇతర భాషల్లో ఈ పాట భారీగా ట్రెండ్ అవుతూ మ్యూజిక్ లవర్స్‌ను పట్టేసింది.

తెలుగు యూట్యూబ్ వెర్షన్ ఒక్కటే 57 మిలియన్ల వ్యూస్ పైగా ఉండగా , 10 లక్షల లైక్స్ దగ్గరగా ఉంది. త్వరలోనే ఈ పాట 1 మిలియన్ లైక్స్ క్లబ్‌లో చేరడం ఖాయం. సాంగ్‌పై టీమ్‌కి ఉన్న నమ్మకం ఇప్పుడు నిజమవుతుందని స్పష్టమవుతోంది.

అంతేకాక, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్‌బుక్ వంటి అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఈ పాటకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ భారీగా వైరల్ అవుతున్నాయి. ‘చికిరి చికిరి’ ఎనర్జీ ప్రస్తుతం ఇంటర్నెట్ అంతా కప్పేస్తోంది.

ఈ మాస్-మెలోడియస్ ట్రాక్‌ను మోహిత్ చౌహాన్ ఆలపించగా, బాలాజీ సాహిత్యం అందించారు. గ్రామీణ క్రీడల ఆధారంగా రూపొందుతున్న ఈ భారీ స్పోర్ట్స్ డ్రామాను బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది.

శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విరిద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా విజువల్ స్పెక్టకిల్ మార్చి 27, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srinivas