
చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉన్న ప్రియకు కుటుంబ సభ్యులు నో చెప్పడంతో ఆమె వైద్య రంగాన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. కెరీర్ సక్సెస్ అయిన తర్వాత, పెళ్లి విషయాన్ని కుటుంబం ముందుకు తేవడంతో, తన జీవితానికి కొత్త మార్గం కావాలనుకున్న ప్రియ, బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకుంది. అగ్నిపరీక్ష పోటీలో గెలిచి ఐదో కామనర్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది.
ఓవరాక్షన్ – ప్రధాన మైనస్
హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచే ప్రియ ప్రతి విషయంలో ఓవరాక్షన్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఇతర కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులకూ ఆమెపై నెగిటివ్ వైబ్ ఎక్కువైంది. సంచాలక్‌గా ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం, ఆలోచించకుండా ఒక్కసారిగా నిర్ణయాలు తీసుకోవడం లాంటి విషయాలు ఆమె ఇమేజ్‌ను దెబ్బతీశాయి.
ఎలిమినేషన్ ఎపిసోడ్
గత వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరిలో ఫ్లోరా ఇమ్యూనిటీ సాధించి సేవ్ అయ్యింది. హరీశ్, రాము, రీతూ, కల్యాణ్‌తో పాటు ప్రియ కూడా నామినేషన్‌లో ఉండగా, అతి తక్కువ ఓట్లు ప్రియకే రావడంతో మూడో వారానికే ఆమె షో నుంచి ఎలిమినేట్ అయింది. అంటే ప్రేక్షకులు ఆమెకు పెద్దగా కనెక్ట్ కాలేదని స్పష్టమవుతోంది. ఇంకా కొన్ని వరాలు హౌస్లో ఉంటాననుకున్న ప్రియ 3 వారాలకే ఎలిమినెట్ అయ్యింది.
ప్రియ పారితోషికం
ఇక మూడు వారాలు హౌస్‌లో గడిపిన ప్రియకు వారానికి రూ.70 వేల చొప్పున ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అందువల్ల మొత్తం రూ.2.10 లక్షల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
