Download App

Pawan Kalyan: ఫ్యాన్ వార్స్ మధ్య సినిమాని చంపేయకండి..

అక్టోబర్ 1, 2025 • By Srinivas
OG సక్సెస్ ఈవెంట్ ఈరోజు హైద్రాబాద్లో జరిగింది. ఈ ఈవెంట్ 'ఓజి' టీంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా హాజరయ్యారు. సినిమా రివ్యూస్, పైరసీ, ఫ్యాన్ వార్స్ పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. యూట్యూబర్స్, రివ్యూయర్స్… మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించి చేయండి. మీరు...
Pawan Kalyan: ఫ్యాన్ వార్స్ మధ్య సినిమాని చంపేయకండి..

OG సక్సెస్ ఈవెంట్ ఈరోజు హైద్రాబాద్లో జరిగింది. ఈ ఈవెంట్ ‘ఓజి’ టీంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా హాజరయ్యారు. సినిమా రివ్యూస్, పైరసీ, ఫ్యాన్ వార్స్ పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.

యూట్యూబర్స్, రివ్యూయర్స్… మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించి చేయండి. మీరు ఎంత మంది పొట్ట కొడుతున్నారో మీకు తెలియట్లేదు, ఆ ఉసురు తగిలేస్తాది జాగ్రత్త.. అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.

సినిమాని కక్ష్య కట్టి చంపేస్తే, కడుపు కోత, ఆకలి.. అంతేకాదు ప్రొడ్యూసర్ పారిపోతాడు. ఫైనాన్షియర్స్ రారు. ఎప్పుడూ బయటికి రాని నేను ఇప్పుడు బయటికి వచ్చాను.. దానికి కారణం సినిమాని అలా వదిలేయలేను. అలాంటి నాకు OG బలాన్నించింది.

ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, నాని.. ఇలా ఎవరైనా ఏ హీరో అయినా కావచ్చు.. మనస్ఫూర్తిగా వర్క్ ని అప్ప్రీషియేట్ చేస్తారు. అందరి అభిమానులకు ఒకటే చెప్తున్నా.. ఒక హీరోని ద్వేషిస్తున్నామంటే మనసు చివుక్కుమంటుంది. మేము ఎంతో వర్క్ చేస్తాం. ఒక్కోరోజు ఇంటికి కూడా వెళ్ళం. ఫ్యాన్ వార్స్ లో దయచేసి సినిమాని చంపేయకండి. దయచేసి ఈ ఫ్యాన్ వార్స్ అనేవి ఆపేసేయండి. ఒకరినొకరు గౌరవించుకుందాం. ఒకరి హీరోను మరొకరి ఫాన్స్ తిట్టుకుంటూ ఉంటె సొసైటీ లో అగ్లీ నెస్ పెరిగిపోతుంది. ఇది ఎవరికీ మంచిది కాదు. ఇది నా రిక్వెస్ట్. మీరు ఎంత మారతారో నాకు తెలియదు. అందరి హీరోల అభిమానులను నేను గౌరవిస్తాను.

సినిమాని చూడటం మానేసి రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. ముందు సినిమా మొత్తం చూడండి. ఈ కల్చర్ మారాలి. నేను హరి హర వీరమల్లు కు ఎంతో ఇబ్బంది పడ్డాను. ఇంకా ఎంతోమంది హీరోలు ఇలాంటి వాటికి బలవుతున్నారు అని అన్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading