సినిమా వార్తలు

Dude ట్రైలర్: “పక్కోడి ఫీలింగ్స్‌ని క్రింజ్ గా చూడటమే కదా ఇప్పుడు ట్రెండ్”

Published by
Srinivas

‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ సినిమాలతో యువ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు తన కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ‘డ్యూడ్’తో మరోసారి రాబోతున్నారు. ఈ చిత్రానికి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా మమితా బైజు నటిస్తున్నారు.

ఇటీవలే చిత్ర యూనిట్‌ ప్రమోషన్లను గ్రాండ్‌గా ప్రారంభించింది. ప్రదీప్ రంగనాథన్ తిరుపతిలోని పలు కాలేజీలను సందర్శించి విద్యార్థులతో, అభిమానులతో ముచ్చటించారు. ఆ ఉత్సాహం మధ్యే ‘డ్యూడ్’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్‌లో రొమాన్స్‌, కామెడీ, ఎమోషన్‌, యాక్షన్‌ అన్నీ మేళవించి ప్రదీప్ స్టైల్‌లోనే కథను ఆవిష్కరించారు. ప్రదీప్ మరోసారి తన నేచురల్ కామెడీ టైమింగ్‌, రిలేటబుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోయిన్ మమితా బైజుతో ఆయన కెమిస్ట్రీ సాఫ్ట్‌గా, రియలిస్టిక్‌గా కనిపిస్తోంది.

కథ పరంగా చూస్తే — ప్రేమతో మొదలైన రిలేషన్‌ బ్రేకప్ తర్వాత ఎలా కాంప్లికేట్ అవుతుందో చూపించే మోడర్న్ ఎమోషనల్ డ్రామాగా కనిపిస్తోంది.

ట్రైలర్‌లోని ఒక డైలాగ్‌ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది – “పక్కోడి ఫీలింగ్స్‌ని క్రింజ్ గా చూడటమే కదా ఇప్పుడు ట్రెండ్”.. ఈ లైన్ యువతకు బాగా కనెక్ట్ అయింది.

చిత్రంలో నేహా శెట్టి కీలక పాత్రలో నటిస్తుండగా, ఆర్. శరత్‌కుమార్, హ్రిదు హరూన్, రోహిణి, ఐశ్వర్య శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని సాయి అభ్యంకర్ సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బీజీఎం స్నిపెట్లు యూత్‌కి బాగా నచ్చాయి.

‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ సినిమాలతో సౌత్‌లో నెక్స్ట్ జెన్ స్టార్‌గా ఎదుగుతున్న ప్రదీప్ రంగనాథన్, ఈసారి కూడా తన మూడో హిట్‌ను అందుకుంటారా అన్న ఆసక్తి పెరిగింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17, 2025న థియేటర్లలో విడుదల కానుంది.

Srinivas