Download App

ఎగ్జిబిటర్స్ కొత్త నిర్ణయం.. ‘పెద్ది’ రిలీజ్‌పై ప్రభావం పడుతుందా?

మే 13, 2026 By Srinivas
తెలంగాణలో థియేటర్ల వ్యవస్థపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ప్రస్తుతం అమలులో ఉన్న ‘రెంటల్ సిస్టమ్’పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వల్ల నిర్మాతలు మాత్రమే లాభపడుతున్నారని, థియేటర్లు మాత్రం నష్టాల్లోకి వెళ్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే...
ఎగ్జిబిటర్స్ కొత్త నిర్ణయం.. ‘పెద్ది’ రిలీజ్‌పై ప్రభావం పడుతుందా?

తెలంగాణలో థియేటర్ల వ్యవస్థపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ప్రస్తుతం అమలులో ఉన్న ‘రెంటల్ సిస్టమ్’పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వల్ల నిర్మాతలు మాత్రమే లాభపడుతున్నారని, థియేటర్లు మాత్రం నష్టాల్లోకి వెళ్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్టీప్లెక్స్‌ల మాదిరిగా ‘పర్సంటేజ్ సిస్టమ్’ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సమావేశంలో Shirish Reddy చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం జీవోల ద్వారా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చినా, పెరిగిన రేట్లతో సినిమాలను ప్రదర్శించబోమని ఎగ్జిబిటర్లు సమిష్టిగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఈ నిర్ణయం ప్రభావం ముందుగా Peddiపై పడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. Ram Charan హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం విడుదలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో, టికెట్ రేట్ల అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ సాధారణ టికెట్ ధరలకే సినిమాను విడుదల చేయాల్సి వస్తే, కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Ram Charan's Peddi

మరోవైపు నైజాం ప్రాంతంలో పెద్ది చిత్రాన్ని Mythri Movie Makers విడుదల చేయనుంది. అయితే మైత్రీ సంస్థ ఇప్పటికే పర్సంటేజ్ సిస్టమ్‌పై వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఆ విధానం అనుకూలం కాదనే భావన నిర్మాతలలో ఉందని సమాచారం.

ఇప్పుడు ఈ వ్యవహారం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎగ్జిబిటర్లు తమ నిర్ణయంపై నిలబడతారా? లేక నిర్మాతలతో చర్చల తర్వాత కొత్త మార్గం కనిపెడతారా? అన్నది చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading