Download App

కష్టాల నుంచి తెరపైకి… ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో మెరిసిన లతీష్ ప్రయాణం

మే 4, 2026 By Srinivas
‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు లతీష్, తన తొలి విజయానందాన్ని ఎంతో భావోద్వేగంగా పంచుకున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా ‘సిద్ధయ్య’ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, తన వ్యక్తిగత జీవితం నుంచి సినిమా ప్రయాణం వరకు ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కుటుంబ...
కష్టాల నుంచి తెరపైకి… ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో మెరిసిన లతీష్ ప్రయాణం

‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు లతీష్, తన తొలి విజయానందాన్ని ఎంతో భావోద్వేగంగా పంచుకున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా ‘సిద్ధయ్య’ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, తన వ్యక్తిగత జీవితం నుంచి సినిమా ప్రయాణం వరకు ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కుటుంబ నేపథ్యం… కష్టాల్లో పెరిగిన జీవితం

నగరిలో వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే నిరుపేద కుటుంబంలో జన్మించిన లతీష్ చిన్ననాటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్న రోజుల్లో కుటుంబం బతికేందుకు చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తల్లిదండ్రులు, అన్నయ్య ఎంతో కష్టపడి చదివించినప్పటికీ, సినిమాల్లోకి రావాలన్న తన నిర్ణయాన్ని కుటుంబం మొదట అంగీకరించలేదన్నారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత అన్నయ్య మళ్లీ తనతో మాట్లాడడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. తన ప్రయాణంలో అక్క చాముండేశ్వరి, మామ కోటేశ్వరరావు కీలకంగా అండగా నిలిచారని తెలిపారు.

కష్టాల నుంచి తెరపైకి… ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో మెరిసిన లతీష్ ప్రయాణం

సినిమా కోసం చేసిన పోరాటం

బెంగళూరులో ఉద్యోగం చేసిన తర్వాత 2017లో హైదరాబాద్ చేరుకున్న లతీష్, అప్పటి నుంచి నటుడిగా నిలదొక్కుకోవాలని కష్టపడ్డారు. చాలామంది తన నటనను మెచ్చుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదని తెలిపారు. దర్శకుడు మహిపాల్ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తూ అనుభవం సంపాదించారు. కరోనా సమయంలో వచ్చిన విరామాన్ని ఉపయోగించుకుని యూట్యూబ్ కోసం షార్ట్ ఫిల్మ్ రూపొందించి, అందులో నటించారు. తరువాత మళ్లీ డైరెక్షన్ విభాగంలో పని కొనసాగించారు.

ఎదురైన సవాళ్లు… ఆత్మవిశ్వాసమే ఆయుధం

షార్ట్ ఫిల్మ్ నిర్మాణంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ, కెమెరా కొనడానికి ఇంట్లో డబ్బులు అడగాల్సి వచ్చిందన్నారు. కథను రిజిస్టర్ చేయించుకోవడంలో కూడా అనేక అవాంతరాలు ఎదురయ్యాయని చెప్పారు. నిర్మాతలు కూడా సహాయం చేయకపోవడంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో డా. షేక్ జాన్ బషీర్ వద్ద శిక్షణ తీసుకోవడం తనకు మలుపు అయ్యిందని పేర్కొన్నారు.

కష్టాల నుంచి తెరపైకి… ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో మెరిసిన లతీష్ ప్రయాణం

బీ స్టూడియో… మార్గదర్శక స్థలం

యాక్టింగ్ కోర్సు కోసం భారీ ఫీజు అడిగినప్పటికీ, తన పట్టుదల చూసి బీ స్టూడియోలో ఉచితంగా శిక్షణ ఇచ్చారని చెప్పారు. అక్కడ నాటకాలు చేస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు. అదే సమయంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ టీమ్ తనను గుర్తించి ఆడిషన్స్‌కు పిలిచిందని తెలిపారు.

విలన్‌గా మారిన ప్రయాణం

సిద్ధయ్య పాత్ర కోసం ప్రత్యేకంగా శారీరక మార్పులు చేసిన లతీష్, దాదాపు 30 కిలోలు బరువు పెరిగారు. ఈ పాత్రకు తగినట్టుగా కనిపించేందుకు ఎంతో శ్రమించానని చెప్పారు. సినిమా చూసిన వారు తనను గుర్తుపట్టలేకపోవడం తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. హీరోతో పాటు విలన్ పాత్ర కూడా కథలో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రశంసలు

సినిమా విడుదల తర్వాత టీమ్ సభ్యుల నుంచి, ముఖ్యంగా హీరో కిరణ్ అబ్బవరం నుంచి మంచి ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు. స్క్రీన్‌పై తన ప్రదర్శన చూసి చాలా మంది ఆశ్చర్యపోయారని అన్నారు. అలాగే నరేష్ అగస్త్య, గురువు బషీర్ సార్ నుంచి కూడా ప్రత్యేక అభినందనలు పొందడం తనకు గర్వంగా అనిపించిందని చెప్పారు. తన గురువు తనను ఆలింగనం చేసుకున్న ఆ క్షణం జీవితాంతం మర్చిపోలేనిదని పేర్కొన్నారు.

ముందున్న ప్రాజెక్ట్స్

ప్రస్తుతం బీ స్టూడియోలో పార్ట్ టైమ్‌గా పనిచేస్తూ, కొత్త కథలను వింటున్నానని లతీష్ తెలిపారు. కొన్ని మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఇంకా ఏదీ ఖరారు కాలేదని చెప్పారు. త్వరలోనే మంచి ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading