కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన Regional Rapid Transit System (RRTS) ప్రస్తుతం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దేశంలో తొలి RRTS కారిడార్‌గా నిలిచిన డిల్లీ మరియు మీరట్ మార్గం పూర్తిస్థాయిలో ప్రారంభమై, NCR ప్రాంతంలో వేగవంతమైన రవాణాకు నాంది పలికింది.
2019లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, 2023లో పాక్షికంగా మొదలైన సేవలు, 2026లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే “నమో భారత్” ట్రైన్లు ఢిల్లీ మరియు మీరట్ మధ్య ప్రయాణాన్ని గంటలోపే పూర్తి అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించారు.
RRTS అమలవుతున్న ప్రాంతం NCR (National Capital Region). ఇది కేవలం ఢిల్లీ కి మాత్రమే కాదు, ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లోని కొన్ని జిల్లాల పరిసర ప్రాంతాలను కలుపుతు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం NCRలో ఈ ప్రాజెక్ట్ అమలు చేసి ప్రజలకు చాలా మేలు చేసింది అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో భారీ జనాభా, రోజువారీ చుట్టూ ఉన్న నగర ప్రాంతాల్లోప్రజల ప్రయాణాలు, ఆర్థిక కార్యకలాపాల దృష్ట్యా ఈ ప్రాంతం ప్రాధాన్యత పొందినది.
అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనిని రాజకీయ కోణంలో చూస్తున్నాయి. ఉత్తర భారత రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, దక్షిణ రాష్ట్రాల అవసరాలను పక్కన పెడుతున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు మధ్య ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. తెలంగాణలో హైదరాబాద్ దేశంలోని ప్రధాన ఐటీ, ఫార్మా , రంగాల్లో చాలా వేగంగా, ఆర్థిక కేంద్రంగా దూసుకుపోతుంది. RRTS తరహా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని నెటిజన్లు కోరుతున్నారు. ఇది చాలా ఖర్చు తో కూడుకున్న ప్రాజెక్టు కాబట్టి….రాష్ట్ర ప్రభుత్వంనకు, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ఇది సాధ్యం కాదని అధికారులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నగర అభివృద్ధి, విశాఖపట్నం మరియు విజయవాడ మధ్య కనెక్టివిటీ వంటి అంశాలు పై కేంద్ర ప్రభుత్వం తో చర్చిస్తున్న , RRTS పేరుతో ప్రాజెక్ట్ ఇంకా రూపుదాల్చలేదు. రాష్ట్ర, కేంద్ర సంబంధాలు బాగున్నప్పటికీ ఆర్థిక ప్రాధాన్యతలు రీత్యా అంచనాలు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఇంకొక అంశం హైదరాబాద్, విజయవాడ మధ్య ఈ RRTS పై ప్రాథమిక సర్వే జరుగుతుంది అంటున్నారు. వైజాగ్ లో నేవీ రక్షణ రంగ సంస్థలు, చమురు సంస్థలు, ఫార్మా, ఐటీ కంపెనీలు సహా వివిధ రంగాల్లో వేగంగా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది కాబట్టి…. హైదరాబాద్, అమరావతి, విశాఖ పట్టణం ల మధ్య ఈ RRTS ప్రాజెక్టు నిర్మాణం చేస్తే….. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుంది అని కొందరు రెండు రాష్ట్రాల్లో నెటిజన్లు కోరుతున్నారు.
అయితే దక్షిణాది రాష్ట్రాల నేతలు కొందరు… దేశంలో వేగవంతమైన రవాణా వ్యవస్థలు అన్ని ప్రాంతాలకు సమానంగా అందాలి కదా… లేక రాజకీయ ప్రాధాన్యత ఉన్న ఉత్తర భారత ప్రాంతాలకే పరిమితం చేస్తారా… అని ప్రశ్నిస్తున్నారు.
భారత్‌లో RRTS విజయవంతంగా ప్రారంభమైంది, కానీ ప్రస్తుతం అది NCRకే పరిమితం చేస్తారా లేక మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తారా…. విస్తరిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా ఈ తరహా ప్రాజెక్ట్ రావాలంటే కొంతకాలం వేచిఉండక తప్పదేమో… ఇటువంటి వాటికి రాజకీయ సంకల్పం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కీలకం…
భవిష్యత్తులో దక్షిణ భారత నగరాలు కూడా ఈ వేగవంతమైన రవాణా జాబితాలో చేరుతాయా? లేక ఇది ఉత్తర భారత ప్రాజెక్టుగానే మిగిలిపోతుందా? అనే ప్రశ్నకు జవాబు కొన్ని రోజుల్లో అందవచ్చు.