Download App

గోపీచంద్33: యోధుడిగా గోపీచంద్.. భారీ చారిత్రాత్మక చిత్రం!

జూన్ 12, 2025 • By Srinivas
మాచో స్టార్ గోపీచంద్ తన 33వ సినిమాగా ఓ విభిన్నమైన హిస్టారికల్ ఎపిక్‌లో నటిస్తున్నారు. #గోపీచంద్33 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం‌ను విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుండగా, పవన్ కుమార్ సమర్పణలో ఈ భారీ బడ్జెట్ చిత్రం...
గోపీచంద్33: యోధుడిగా గోపీచంద్.. భారీ చారిత్రాత్మక చిత్రం!

మాచో స్టార్ గోపీచంద్ తన 33వ సినిమాగా ఓ విభిన్నమైన హిస్టారికల్ ఎపిక్‌లో నటిస్తున్నారు. #గోపీచంద్33 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం‌ను విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుండగా, పవన్ కుమార్ సమర్పణలో ఈ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది.

గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఒక యోధుడిగా గోపీచంద్ లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంది. పొడవాటి జుట్టు, యుద్ధగాయాలు, నుదిటిపై వీర తిలకం, చేతిలో ఖడ్గంతో యుద్ధరంగంలో నిలిచిన దృశ్యం — ఇది గోపీచంద్ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ లుక్ అని చెప్పొచ్చు.

గ్లింప్స్‌ లో మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఓ యోధుడు తన టెంట్ నుంచి బయటికొచ్చి, తన గుర్రంతో మమేకమయ్యే ఎమోషనల్ మోమెంట్ చూపించబడుతుంది. అతని నిశ్శబ్దతే ఓ గొప్ప వాగ్దానం లా అనిపిస్తుంది. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో “ధీర ధీర” మ్యూజిక్, విజువల్స్‌ను ఇంకెంతో శక్తివంతంగా మలుస్తూ ప్రేక్షకుల హృదయాలను తాకుతోంది.

గోపీచంద్33: యోధుడిగా గోపీచంద్.. భారీ చారిత్రాత్మక చిత్రం!

సంకల్ప్ రెడ్డి, ఇప్పటికే IB 71 (ఆకాశంలో), ఘాజి (నీటిలో), అంతరిక్షం (అంతరిక్షంలో) వంటి ప్రాజెక్టులతో తన ప్రత్యేక దిశానిర్దేశం మరియు టెక్నికల్ టచ్‌ను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన మరొక కొత్త ప్రయోగం — భారత చరిత్రలో మరిచిపోయిన 7వ శతాబ్దంలోని ఓ కీలక ఘట్టాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఈ కథను గొప్పగా మలచేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు.

ఈ సినిమాలో గోపీచంద్ ఇప్పటివరకు చూడనివంటి పూర్తిగా డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్‌లో కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సెట్లో నెక్స్ట్ షెడ్యూల్ జరుగుతోంది.

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించనున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading