Download App

‘OG’లో మరో సంచలనం – ‘గన్స్ ఎన్ రోజెస్’… ఒక అగ్ని తుఫాను

సెప్టెంబర్ 15, 2025 • By Rahul N
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా చుట్టూ ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని రోజుకా కిందట వచ్చిన ఫైర్ స్టార్మ్ (Fire Storm) దుమ్ము దులిపేయగా, ఇటీవల విడుదలైన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ (Trans of OMI) పాటతో అభిమానులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు మరోసారి...
'OG'లో మరో సంచలనం – ‘గన్స్ ఎన్ రోజెస్’… ఒక అగ్ని తుఫాను

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా చుట్టూ ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని రోజుకా కిందట వచ్చిన ఫైర్ స్టార్మ్ (Fire Storm) దుమ్ము దులిపేయగా, ఇటీవల విడుదలైన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ (Trans of OMI) పాటతో అభిమానులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు మరోసారి కొత్త సాంగ్ తో మాస్ మానియాను పెంచుతోంది. ‘గన్స్ ఎన్ రోజెస్’ (Guns N Roses) పేరుతో విడుదలైన ఈ పాట కేవలం టాలీవుడ్‌లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

సంగీత దర్శకుడు తమన్ ఎస్ తన ప్రత్యేకమైన బాణీతో ఈ పాటను మలచారు. ఉరుములు, మెరుపులు తలపించే బీట్స్‌, పదునైన అమరికలు, మూడ్ ఎలివేషన్ – అన్నీ కలిపి ఈ గీతాన్ని ఒక అగ్ని తుఫానుగా మార్చేశాయి. ‘గన్స్ ఎన్ రోజెస్’ పాట విన్న ప్రతి ఒక్కరికి, గంభీరుడు నడిచే ఆ క్రూరమైన ప్రపంచం కళ్లముందే ప్రత్యక్షమవుతుంది.

ఈ పాట కేవలం ఓ లిరికల్ ట్రాక్ కాదు – ఇది ‘ఓజీ’ యొక్క ఆత్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించిన గంభీరుడి ఆవేశం, అతని యుద్ధరంగం, చుట్టూ తిరుగుతున్న ప్రమాదకర శక్తులు – ఇవన్నీ ఈ గీతంలో ప్రతీ లయ, ప్రతీ గమనికలో వినిపిస్తున్నాయి. ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ తర్వాత వచ్చిన ఈ పాట సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది.

సెప్టెంబర్ 25, 2025న ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇంకో పది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అభిమానుల ఉత్సాహం తారాస్థాయిలో ఉంది. అంతేకాకుండా, ట్రైలర్ కూడా త్వరలో రానుందని అధికారిక ప్రకటన రావడంతో, ఎదురుచూపులు మరింత పెరిగాయి.

ఎక్కడ చూసినా ‘OG’ మానియా

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌, పాటలు – అన్నీ ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో హవా క్రియేట్ చేశాయి. ఇప్పుడు ‘గన్స్ ఎన్ రోజెస్’ కూడా అదే బాటలో పయనిస్తూ అభిమానులను మైమరపిస్తోంది.

దర్శకుడు సుజీత్ ఈ సినిమాను ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి శక్తివంతమైన నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

విజువల్స్‌కి రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్‌కి నవీన్ నూలి, సంగీతానికి తమన్ – అందరూ కలిసి ఈ సినిమాను ఒక అద్భుతమైన చిత్రంగా తీర్చిదిద్దుతున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading