కయాదు లోహర్.. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ సినిమా సక్సెస్ తో ఇప్పుడిప్పుడే వరుసగా అవకాశాలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. ఇలాంటి టైమ్ లో వివాదంలో చిక్కుకుంది కయాదు.
తమిళనాట భారీ కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల TASMAC స్కాంలో పాల్గొన్న వ్యక్తులతో కయాదు లోహర్ కు సంబంధాలున్నట్టు ఈడీ గుర్తించింది.
TASMAC కుంభకోణానికి సంబంధించి వ్యక్తులు కొంతమంది హై-ప్రొఫైల్ పార్టీలు చేసుకున్నారు. ఈ నైట్ పార్టీలకు కయాదు హాజరైంది. ఇలా హాజరైనందుకు ఆమెకు 35 లక్షల రూపాయలు చెల్లించినట్టు ఈడీ దాడుల్లో బయటపడింది.
ఈ వార్త కోలీవుడ్ ను షాక్ కు గురిచేసింది. హీరోయిన్లు కొంతమంది నైట్ పార్టీలకు వెళ్తారనే ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. కయాదు ఇప్పుడు సాక్ష్యాలతో సహా దొరికింది. ఈ కేసును ఆమె ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.