Download App

స్పైడర్-మ్యాన్‌కు నేనూ వీరాభిమానినే.. పిల్లల కోసం టికెట్లు కూడా బుక్ చేశా: రిషబ్ శెట్టి

జూలై 28, 2026 • By Srinivas
'కాంతార' ఫేమ్ నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి తనకు చిన్నప్పటి నుంచి స్పైడర్-మ్యాన్ అంటే ఎంతటి అభిమానం ఉందో తాజాగా వెల్లడించారు. Spider-Man: Brand New Day విడుదలకు ముందు మార్వెల్ విడుదల చేసిన ప్రత్యేక ప్రమోషనల్ వీడియోలో పాల్గొన్న ఆయన.. తన చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు స్పైడర్-మ్యాన్ తన...
స్పైడర్-మ్యాన్‌కు నేనూ వీరాభిమానినే.. పిల్లల కోసం టికెట్లు కూడా బుక్ చేశా: రిషబ్ శెట్టి

‘కాంతార’ ఫేమ్ నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి తనకు చిన్నప్పటి నుంచి స్పైడర్-మ్యాన్ అంటే ఎంతటి అభిమానం ఉందో తాజాగా వెల్లడించారు. Spider-Man: Brand New Day విడుదలకు ముందు మార్వెల్ విడుదల చేసిన ప్రత్యేక ప్రమోషనల్ వీడియోలో పాల్గొన్న ఆయన.. తన చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు స్పైడర్-మ్యాన్ తన జీవితంపై చూపిన ప్రభావాన్ని ఆసక్తికరంగా వివరించారు.

వీడియోలో మాట్లాడిన రిషబ్ శెట్టి.. చిన్నతనంలో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో తొలిసారి స్పైడర్-మ్యాన్ సినిమాను చూసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి పీటర్ పార్కర్ పాత్ర తనకు ఎంతో దగ్గరైందని, ఆ పాత్రలో కనిపించిన సాధారణ మనిషి పోరాటం తనను బాగా ప్రభావితం చేసిందని చెప్పారు.

“చిన్నప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో స్పైడర్-మ్యాన్ సినిమాను చూసిన రోజు ఇప్పటికీ గుర్తుంది. పీటర్ పార్కర్ పాత్రతో వెంటనే కనెక్ట్ అయ్యాను. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తప్పులు జరిగినా మనలోని మంచితనాన్ని నిలబెట్టుకోవాలని ఆ పాత్ర నేర్పింది. ‘అత్యధిక శక్తి ఉంటే అంతే బాధ్యత కూడా ఉంటుంది’ అనే సందేశం నన్ను ఎప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటుంది. అందుకే స్పైడర్-మ్యాన్ నా ఆల్‌టైమ్ ఫేవరెట్ సూపర్ హీరో” అని రిషబ్ తెలిపారు.

తన అభిమానాన్ని ఇప్పుడు తన పిల్లలు కూడా పంచుకుంటున్నారని చెప్పిన ఆయన.. “నా పిల్లలకు కూడా స్పైడర్-మ్యాన్ అంటే చాలా ఇష్టం. వాళ్లతో కలిసి Spider-Man: Brand New Day చూడాలని ముందుగానే టికెట్లు బుక్ చేశాను. ఈసారి కుటుంబమంతా కలిసి థియేటర్‌లో ఆ అనుభూతిని ఆస్వాదించబోతున్నాం” అని చెప్పారు.

ఇక టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన Spider-Man: Brand New Day చిత్రం జూలై 30న భారతీయ ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్వెల్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం భారతదేశంలో కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading