Download App

OG OTT: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ దీపావళికి స్ట్రీమింగ్ ?

అక్టోబర్ 16, 2025 • By Srinivas
పవన్ కల్యాణ్ తాజా బ్లాక్‌బస్టర్ ‘ఓజీ’ (OG) బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ 2025 సంవత్సరంలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. విడుదలైన రోజు నుండి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ, ఈ చిత్రం పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తోంది. విశేషంగా, ఉత్తర...
OG OTT: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ దీపావళికి స్ట్రీమింగ్ ?

పవన్ కల్యాణ్ తాజా బ్లాక్‌బస్టర్ ‘ఓజీ’ (OG) బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ 2025 సంవత్సరంలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. విడుదలైన రోజు నుండి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ, ఈ చిత్రం పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తోంది.

విశేషంగా, ఉత్తర అమెరికాలో ఈ చిత్రం $5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరి, పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అనే రికార్డును కూడా సొంతం చేసుకుంది. పవర్ స్టార్ అభిమానులకు ఇది నిజంగా గర్వకారణం అయ్యింది.

పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో అద్భుతమైన స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఆయనకు జోడీగా ప్రియాంకా మోహన్ నటించగా, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి కొత్త స్థాయి అందించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ తెరకెక్కించారు.

ఇక థియేట్రికల్ రన్‌లో ఘన విజయాన్ని అందుకున్న తర్వాత, ఇప్పుడు ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నది. ఈ చిత్రానికి స్ట్రీమింగ్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంస్థ కొంత కాలం క్రితమే భారీ మొత్తంతో సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ నెల చివర్లోనే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.

సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్‌కు సినిమా విడుదలైన 28 రోజుల తర్వాత స్ట్రీమింగ్ హక్కులు లభిస్తాయి. దాని ప్రకారం అక్టోబర్ 24 నాటికి ‘ఓజీ’ స్ట్రీమింగ్‌కి రావాలి. అయితే, తాజా బజ్ ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21నే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. అయితే స్ట్రీమింగ్ డేట్ కి సంబంధించి చివరి నిమిషంలో అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్ .

శక్తివంతమైన కథ, పవన్ కల్యాణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, సుజీత్‌ స్టైలిష్‌ మేకింగ్‌ అన్నీ కలిపి ‘ఓజీ’ని 2025లో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో నిలిపాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడు స్ట్రీమ్ కానుందో తెలుసుకోవడమే అభిమానుల ప్రధాన ఆసక్తి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading