Download App

కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ నుంచి ఓనమ్ సాంగ్‌

ఆగస్ట్ 6, 2025 By Rahul N
సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం "K-ర్యాంప్" దీపావళి కానుకగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్లు రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తుండగా,...
కిరణ్ అబ్బవరం 'K-ర్యాంప్' నుంచి ఓనమ్ సాంగ్‌

సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం “K-ర్యాంప్” దీపావళి కానుకగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్లు రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తుండగా, యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన ‘ఓనమ్’ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఈ పాటకు ఎనర్జిటిక్ ట్యూన్ కంపోజ్ చేశారు. కేరళ పండుగ ఓనమ్ నేపథ్యంగా సాగే ఈ పాటను మలయాళ ట్రెడిషన్‌ని ప్రతిబింబించేలా కలర్‌ఫుల్‌గా తెరకెక్కించారు.

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజాతో పాటు నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading