Download App

‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ డీల్ ఫిక్స్.. రిలీజ్ అయ్యేది అప్పుడే…

జూలై 27, 2026 By Srinivas
థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న 'చెన్నై లవ్ స్టోరీ' మరో కీలక మైలురాయిని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ రొమాంటిక్ డ్రామా డిజిటల్, శాటిలైట్ హక్కులను ప్రముఖ మీడియా సంస్థ సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) సొంతం చేసుకుంది. దీంతో థియేట్రికల్ రన్ పూర్తయిన...
'చెన్నై లవ్ స్టోరీ' ఓటీటీ డీల్ ఫిక్స్.. రిలీజ్ అయ్యేది అప్పుడే…

థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ మరో కీలక మైలురాయిని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ రొమాంటిక్ డ్రామా డిజిటల్, శాటిలైట్ హక్కులను ప్రముఖ మీడియా సంస్థ సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) సొంతం చేసుకుంది. దీంతో థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈ చిత్రం సోనీ లివ్ (Sony LIV) వేదికగా ప్రేక్షకులను అలరించనుంది.

జూలై 24న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ముఖ్యంగా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటూ ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇద్దరి మధ్య కనిపించిన సహజమైన కెమిస్ట్రీ, భావోద్వేగాలతో కూడిన నటన సినిమాకు ప్రధాన బలంగా మారాయి. తొలి ప్రేమలో ఉండే అమాయకత్వం, ఆనందం, బాధ, విడిపోవడం వంటి భావోద్వేగాలను దర్శకుడు హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

'చెన్నై లవ్ స్టోరీ' ఓటీటీ డీల్ ఫిక్స్.. రిలీజ్ అయ్యేది అప్పుడే…

ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. “ప్రేక్షకులు ‘చెన్నై లవ్ స్టోరీ’ని ఇంతగా ఆదరించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. సినిమా, పాత్రలతో వారు ఎమోషనల్‌గా కనెక్ట్ కావడం మా టీమ్‌కు గొప్ప సంతృప్తిని ఇచ్చింది. ఈ చిత్రాన్ని మరింత విస్తృత ప్రేక్షకులకు చేరవేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది. దక్షిణాది నుంచి మంచి కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సోనీ లివ్‌లో మా సినిమా కూడా చేరడం గర్వంగా ఉంది” అని అన్నారు.

Read Review: చెన్నై లవ్‌స్టోరీ మూవీ రివ్యూ

సాయి రాజేష్ నీలం కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు.

థియేటర్లలో విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ విడుదల తేదీ, శాటిలైట్ ప్రీమియర్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర బృందం త్వరలోనే విడుదల చేయనుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading