సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం “K-ర్యాంప్” దీపావళి కానుకగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్లు రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తుండగా, యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన ‘ఓనమ్’ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఈ పాటకు ఎనర్జిటిక్ ట్యూన్ కంపోజ్ చేశారు. కేరళ పండుగ ఓనమ్ నేపథ్యంగా సాగే ఈ పాటను మలయాళ ట్రెడిషన్‌ని ప్రతిబింబించేలా కలర్‌ఫుల్‌గా తెరకెక్కించారు.
ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజాతో పాటు నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.