Download App

సంచలనం సృష్టిస్తున్న ‘మయసభ’ – ఇండియాలో టాప్ 3 ప్లేస్‌లో ట్రెండింగ్

ఆగస్ట్ 19, 2025 • By Rahul N
సోనీ LIVలో స్ట్రీమింగ్ అవుతున్న తాజా తెలుగు ఒరిజినల్ ‘మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఆగస్టు 11–17, 2025 వారానికి గానూ ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన సర్వే ప్రకారం, భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన స్ట్రీమింగ్ షోల జాబితాలో ఈ సిరీస్ 3వ స్థానంలో నిలిచింది....
సంచలనం సృష్టిస్తున్న ‘మయసభ’ – ఇండియాలో టాప్ 3 ప్లేస్‌లో ట్రెండింగ్

సోనీ LIVలో స్ట్రీమింగ్ అవుతున్న తాజా తెలుగు ఒరిజినల్ ‘మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఆగస్టు 11–17, 2025 వారానికి గానూ ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన సర్వే ప్రకారం, భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన స్ట్రీమింగ్ షోల జాబితాలో ఈ సిరీస్ 3వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 2.8 మిలియన్ల వీక్షణలు సాధించడం గమనార్హం.

దేవా కట్టా, కిరణ్ జే కుమార్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సిరీస్, 1974 నుండి 1983 వరకూ ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల ఆధారంగా సాగుతుంది. కాకర్ల కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి), ఎంఎస్ రామి రెడ్డి (చైతన్య రావు) స్నేహం, బంధం, రాజకీయ విభేదాల చుట్టూ కథ నడుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

సంచలనం సృష్టిస్తున్న ‘మయసభ’ – ఇండియాలో టాప్ 3 ప్లేస్‌లో ట్రెండింగ్

దివ్య దత్తా, సాయికుమార్, నాజర్, శత్రు, రవీంద్ర విజయ్, తాన్య రవిచంద్రన్ వంటి ప్రముఖ నటీనటులు ఇందులో నటించడం విశేషం.

ఉత్కంఠభరితమైన కథ, గట్టి ఎమోషన్స్, రాజకీయ నాటకీయత కలగలిపిన ఈ సిరీస్ పాన్-ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం Sony LIVలో ప్రత్యేకంగా ప్రసారం అవుతోంది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading