సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి: క్లాస్, మాస్ లుక్స్ తో కుర్ర హీరోలకే గట్టి పోటీ!

Published by
Srinivas

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినీ కెరీర్‌లో మరో సరికొత్త దశలో ఉన్నారు. సీనియర్ హీరో అయినప్పటికీ, ఇప్పటికీ తన స్టైల్, వర్క్ ఎనర్జీతో యంగ్ హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు “విశ్వంభర” విడుదలకు సన్నాహాలు జరుగుతుండగా, మరోవైపు “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. బాబీ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ కూడా ఫైనల్ దశలో ఉంది. అలాగే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో భారీ మాస్ ఎంటర్‌టైనర్ కూడా లైన్‌లో ఉంది .

ఇక చిరు స్వాగ్‌ గురించి చెప్పాలంటే — వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అని మరోసారి నిరూపించాడు. 70 ఏళ్ల వయస్సులో కూడా చిరంజీవి ముఖంలో ఆ ఎనర్జీ, బాడీలో ఆ స్టైల్‌ అస్సలు తగ్గడం లేదు. తాజాగా ఆయన చేసిన కొత్త ఫోటోషూట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌గా మారింది.

క్లాస్‌ లుక్‌లో సూట్‌ వేసుకుని చిరు స్టైలిష్‌గా మెరిశాడు. మరోవైపు ఫ్లోరల్‌ షర్ట్‌లో మాస్‌ లుక్‌తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టేశాడు. ఇక రెడ్‌ షర్ట్‌లో ఊబర్‌ కూల్‌గా కనిపించిన చిరు ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఫోటోషూట్‌ చూసిన అభిమానులు సోషల్‌ మీడియాలో పాజిటివ్ కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. “ఈ వయస్సులో కూడా ఇంత ఛార్మ్‌ ఎలా?”, “చిరు కి వయస్సు తగ్గిందేమో!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఆయన రాబోయే సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుసగా రిలీజ్‌కి సిద్ధమైన ప్రాజెక్ట్స్‌తో చిరు మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటుతాడా? అన్నది చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts