మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగకుండా దూసుకెళ్తోంది!
రిలీజ్ అయిన రెండురోజుల్లోనే ఈ పాట 17 మిలియన్ వ్యూస్ దాటేసింది. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఈ సాంగ్ దుమ్ము రేపుతోంది. చిరంజీవి మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్‌తో ఇచ్చిన ఈ సాంగ్ అభిమానులకు పండగ మూడ్‌లోకి తీసుకెళ్లింది.
భీమ్ సీసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటలో ఎలక్ట్రానిక్ బీట్స్, ట్రెడిషనల్ పర్కషన్, సింథ్ టచ్… పక్కా ఎంటర్టైన్మెంట్ సౌండ్ ఇచ్చాయి. భాస్కరభట్ల లిరిక్స్ చిలిపి ఫన్, క్లాసీ లైన్స్‌తో కిక్ ఇవ్వగా… ఉదిత్ నారాయణ్ వాయిస్‌కి నాస్టాల్జిక్ ఫీల్, శ్వేతా మోహన్ వాయిస్‌కి ఫ్రెష్ వైబ్ – రెండూ సాంగ్‌కి స్పెషల్ కలర్ జోడించాయి.
చిరంజీవి ఎనర్జీ, ఆయన డ్యాన్స్ స్టెప్స్, నయనతారతో స్క్రీన్‌పై కెమిస్ట్రీ కలిపి చూసే వాళ్లని థియేటర్ ఫీల్‌లోకి తీసుకెళ్తున్నాయి. చిరు స్టైల్, అనిల్ రావిపూడి మాస్ టచ్ కలిసినప్పుడు వచ్చే ఆ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ వైబ్ ఇది!
షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమాటోగ్రఫీ – సమీర్ రెడ్డి, ఎడిటింగ్ – తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్షన్ – ఏఎస్ ప్రకాష్.
‘మీసాల పిల్ల’ తో మెగాస్టార్ మరోసారి చూపించాడు – ఏ జానర్ అయినా, ఏ సాంగ్ అయినా, చిరు స్టెప్ అంటే గ్యారంటీగా ఫైర్! అని అభిమానులు చెబుతున్నారు.