ఆంధ్ర ప్రదేశ్

ప్రధాని పర్యటనను ఫేక్ ప్రచారానికి వేదికగా మార్చిన వైకాపా – కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా…

Published by
Rahul N

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను సైతం రాజకీయ లాభం కోసం వాడుకుంటోందని వైకాపాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానిని కలిసిన సందర్భాన్ని సైతం ఫేక్ ప్రచారానికి వేదికగా మార్చిందని ఆరోపణలు ఎదురవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైకాపా నేతలు, కార్యకర్తలు “ప్రధాని వద్ద మెడికల్ కాలేజీలకు నిధులు కోరాం, వాల్మీకీ సమాజాన్ని ఎస్టీ కేటగిరీలో చేర్చాలని వినతి పత్రం ఇచ్చాం” అంటూ వైకాపా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం నడిపిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే కేంద్ర వర్గాల సమాచారం ప్రకారం అలాంటి ఎటువంటి వినతిపత్రం ప్రధానికి సమర్పించలేదని స్పష్టం అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఆ ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని సమాచారం.

విశేషమేమిటంటే— అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రధాని పర్యటనల్లో ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం ఇవ్వని వైకాపానే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతోందని విమర్శకులు అంటున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రోటోకాల్ పాటిస్తూ ప్రతీ ప్రజా ప్రతినిధికి గౌరవం ఇస్తున్నప్పటికీ, వైకాపా మాత్రం ఆ గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రజల్లో తిరిగి తన స్థానం సంపాదించాలనే ప్రయత్నంలో వైకాపా ఈ రకమైన “ఫేక్ నేరేటివ్” లను సృష్టిస్తోందని, కానీ ఇవి తాత్కాలిక ప్రయోజనాలకే పరిమితమవుతాయని పేర్కొంటున్నారు.

Rahul N

Recent Posts