Download App

‘రాకాస’ నుంచి మెలోడీ సాంగ్ ‘పదే పదే’ విడుదల

మార్చి 14, 2026 By Srinivas
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఫాంటసీ అడ్వెంచర్ ఎంటర్టైనర్ ‘రాకాస’ నుంచి మెలోడీ సాంగ్ ‘పదే పదే’ తాజాగా విడుదలైంది. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ఈ పాట ప్రేమ భావాలను మృదువుగా వ్యక్తం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,...
‘రాకాస’ నుంచి మెలోడీ సాంగ్ ‘పదే పదే’ విడుదల

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఫాంటసీ అడ్వెంచర్ ఎంటర్టైనర్ ‘రాకాస’ నుంచి మెలోడీ సాంగ్ ‘పదే పదే’ తాజాగా విడుదలైంది. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ఈ పాట ప్రేమ భావాలను మృదువుగా వ్యక్తం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, మొదటి సాంగ్‌లతో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.

పదే పదే ప్రాణం నిన్నే కోరగా కలే నిజం కాదా నిన్ను చేరగా ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా ప్రపంచమే లేదే ప్రతి క్షణం నువ్వే నా కథ

అంటూ సాగే ఈ పాటలో అమ్మాయి తన మనసులోని ప్రేమను అబ్బాయికి చెప్పాలనే ఆతృతను అందంగా చూపించారు. హీరోయిన్‌కు హీరోపై ఉన్న ప్రేమ, వన్ సైడ్ లవ్ భావనను ఈ మెలోడీ సున్నితంగా తెలియజేస్తుంది. గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన విజువల్స్ కూడా పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

‘రాకాస’ నుంచి మెలోడీ సాంగ్ ‘పదే పదే’ విడుదల

అనుదీప్ దేవ్ అందించిన బాణీ, కిట్టు విస్సాప్రగడ రాసిన సాహిత్యం, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటను హృదయాలను హత్తుకునేలా మార్చాయి. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ అందించగా, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మూవీ ఆడియో హక్కులను సరిగమ సంస్థ సొంతం చేసుకుంది.

ప్ర‌ముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో, తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిర్మిస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ విజయానంతరం నిహారిక నిర్మిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్, కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ సంస్థలు విడుదల చేయనున్నాయి. ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading