Download App

ఓటీటీలోకి వస్తున్న మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

జూలై 29, 2026 By Srinivas
ప్రపంచ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన 'కింగ్ ఆఫ్ పాప్' మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మైఖేల్' సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఈ బయోపిక్, థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన తర్వాత డిజిటల్...
ఓటీటీలోకి వస్తున్న మైఖేల్ జాక్సన్ బయోపిక్ 'మైఖేల్'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ప్రపంచ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మైఖేల్’ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఈ బయోపిక్, థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

బాక్సాఫీస్ వద్ద 1.01 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన ‘మైఖేల్’, ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన బయోగ్రాఫికల్ చిత్రంగా చరిత్ర సృష్టించింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రేక్షకుల నుంచి లభించిన అద్భుతమైన మౌత్ టాక్‌తో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు గుడ్ న్యూస్. ఆగస్టు 29 నుంచి జియో హాట్‌స్టార్‌లోని పీకాక్ హబ్‌లో ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రెంటల్ విధానంలో అందుబాటులో ఉన్నప్పటికీ, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఈ సినిమాను వీక్షించవచ్చు.

ఓటీటీలోకి వస్తున్న మైఖేల్ జాక్సన్ బయోపిక్ 'మైఖేల్'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం విశేషం. తన రూపురేఖలు, నటన, డ్యాన్స్‌తో మైఖేల్ జాక్సన్‌ను తెరపై మళ్లీ సజీవంగా తీసుకొచ్చిన జాఫర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి.

దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ చిత్రం, 1960లలో ‘ది జాక్సన్ 5’ సంగీత బృందంతో మైఖేల్ జాక్సన్ ప్రయాణం ప్రారంభమైన నాటి నుంచి, ప్రపంచ సంగీత దిగ్గజంగా ఎదిగిన తొలి దశ వరకు జరిగిన కీలక సంఘటనలను హృద్యంగా ఆవిష్కరిస్తుంది. కుటుంబం, సంగీతం, కష్టాలు, విజయాలతో కూడిన మైఖేల్ జీవితాన్ని భావోద్వేగాలతో చూపించే ప్రయత్నం చేసింది.

ఈ చిత్రంలో నియా లాంగ్, లారా హారియర్, జులియానో క్రూ వాల్డీ, మైల్స్ టెల్లర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులను అలరించిన ఈ బయోపిక్ ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకునేందుకు సిద్ధమవుతోంది. మైఖేల్ జాక్సన్ అభిమానులకు ఇది మరోసారి ఆయన అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని ఆస్వాదించే మంచి అవకాశంగా నిలవనుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading