
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నభా నటేష్ ఇచ్చిన మెసేజ్ ఫ్యాన్స్‌కి స్పూర్తిదాయకంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చెట్టును ఆలింగనం చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ ఆమె పోస్ట్ చేసిన ఎమోషనల్ మెసేజ్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది.
“ఈ రోజు ఒక చెట్టును కౌగిలించుకున్నాను… ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకుందనే అనిపించింది” అని పేర్కొంటూ ప్రకృతిపట్ల తన ప్రేమను నభా చక్కగా వ్యక్తం చేసింది. “ఇంత అందమైన ప్రపంచాన్ని చూసేందుకు మనం అతిథులం. ప్రకృతి మనకు ఎన్నో అనుభూతులు ఇస్తోంది. ఈ పర్యావరణాన్ని ఆస్వాదించడం మాత్రమే మన హక్కు. ఈ సంతోషాలు ఇచ్చిన ప్రకృతికి నేను రుణపడి ఉంటాను” అని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం నభా నటేష్ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. నిఖిల్ సరసన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’, అలాగే మరో భారీ చిత్రం **‘నాగబంధం’**లో నటిస్తోంది. రెండు సినిమాలు కూడా త్వరలో థియేటర్లలో విడుదల కానున్నాయి. దీంతో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు నభా లైనప్‌లో ఉన్నాయి.
ప్రకృతిని ప్రేమించే తన ఆలోచనలను అభిమానులతో పంచుకున్న నభా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
