Download App

నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఫస్ట్ సింగిల్ విడుదల

ఆగస్ట్ 8, 2025 By Rahul N
హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమాకు మంచి బజ్ ఏర్పడుతోంది. రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విధి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగశౌర్య...
నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' ఫస్ట్ సింగిల్ విడుదల

హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమాకు మంచి బజ్ ఏర్పడుతోంది. రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విధి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగశౌర్య ఇంటెన్స్ క్యారెక్టర్‌ని ప్రదర్శించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.

మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ “నా మావ పిల్లనిత్తానన్నాడే” సాంగ్ విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. మెలోడీ మాస్టర్ హారిస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఈ వైబ్రెంట్, ఫుట్-టాపింగ్ నెంబర్‌కి కాసర్ల శ్యామ్ మాస్‌ని ఆకట్టుకునేలా లిరిక్స్ అందించారు. కారుణ్య, హరి ప్రియ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటను మరింత ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దారు.

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' ఫస్ట్ సింగిల్ విడుదల

ఈ సాంగ్‌లో నాగశౌర్య–విధి కెమిస్ట్రీ, కలర్‌ఫుల్ ప్రెజెంటేషన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా, హీరో డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేక హైలైట్‌గా నిలిచాయి. పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీకి రసూల్ ఎల్లోర్, ఆర్ట్ డైరెక్టర్‌గా రామాంజనేయులు, ఎడిటింగ్‌కు కోటగిరి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading