ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్‌పో సిటీలో జరిగిన ఈ ఘనమైన కార్యక్రమంలో తొలిరోజు తెలుగు చిత్రాల విభాగానికి సంబంధించిన అవార్డులు అందజేశారు.
ఉత్తమ చిత్రంగా ‘కల్కి’ ఎంపికై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఉత్తమ నటుడి అవార్డును స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందుకున్నారు. ఉత్తమ దర్శకుడుగా సుకుమార్ అవార్డు అందుకోవడం మరో ముఖ్యాంశంగా మారింది.
ఇక క్రిటిక్స్ విభాగంలో కూడా తెలుగు సినిమా ప్రతిభ వెలుగొందింది. ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా తేజ సజ్జా అవార్డు అందుకోగా, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్ వర్మ సత్కరించబడ్డారు.
సౌత్ సినిమాకి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తున్న SIIMA అవార్డులు, ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా తెలుగు సినిమా ప్రతిభను వేదికపై ప్రదర్శించాయి.
‘సైమా’ 2025 అవార్డ్ విన్నర్స్ (తెలుగు) వివరాలిలా ఉన్నాయి..
ఉత్తమ చిత్రం – కల్కి
ఉత్తమ దర్శకుడు – సుకుమార్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – ప్రశాంత్ వర్మ
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – తేజ సజ్జా
ఉత్తమ నటి – రష్మిక మందన్నా
ఉత్తమ నటి (క్రిటిక్స్) – మీనాక్షి చౌదరి
ఉత్తమ సహాయ నటుడు – అమితాబ్ బచ్చన్
ఉత్తమ సహాయ నటి – అన్నే బెన్
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ)
ఉత్తమ గీతరచయిత – రామ్ జోగయ్య శాస్త్రి
ఉత్తమ గాయకుడు – శంకర్ బాబు కందుకూరి
ఉత్తమ గాయని – శిల్పా రావు
ఉత్తమ ప్రతినాయకుడు – కమల్ హాసన్
ఉత్తమ పరిచయ నటి – పంకూరి, భాగ్యశ్రీ బోర్స్
ఉత్తమ పరిచయ నటుడు – సందీప్ సరోజ్
ఉత్తమ పరిచయ దర్శకుడు – నంద కిషోర్ యేమని
ఉత్తమ కొత్త నిర్మాత – నిహారిక కొణిదెల
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు
ఉత్తమ హాస్యనటుడు – సత్య