ప్రజాస్వామ్యం అంటే…. ప్రజల కోసం, ప్రజలకొరకు, ప్రజలచేత అనే అర్ధం… అంటే ఏదైనా ప్రజలకోసమే… కాని ఇప్పుడు అర్ధం మారిపోతుంది. ప్రభుత్వాలు కొంతమంది కోసమే పని చేస్తున్నాయని అనిపిస్తుంది. ప్రజల ఆనందం కోసం కళలు కాని… నేటి సమాజంలో… సమాజ హితం కోసం నుండి.. మాఫియా అవతారాన్ని ఆవహించుకున్నది… సినిమా.. అది పూర్తిగా వ్యాపారాన్ని అపాదించుకుంటే “సినిమా”గా తయారయ్యింది.
కులాల కురుక్షేత్రం లో తగలబడిపోతు ప్రజల కు ఆనందం కలిగిస్తుందని బ్రమింపచేస్తూ …. తమ తమ ఉదరాన్ని నింపుకుంటూ భుక్తాయాసాన్ని, అనుభవిస్తున్న కొంతమంది హీరో ల అత్యాశ మూలంగా “ఐ బొమ్మ” లాంటివి పుట్టుకొస్తున్నాయి. సినిమా ని పైరసీ చేయడం నేరమే, అయినప్పటికీ “ఐ బొమ్మ” రవిని సమాజం వెనకేసుకు వస్తుంది అంటే…. సినిమా జనాలను సామాన్య ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారో అర్ధం అవుతుంది. తమ స్వార్థం కోసం అమాయక ప్రజల అభిమానాన్ని, వాళ్ళ శ్రమ నీ రూపాయల రూపంలో మార్చుకుని వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు సినిమా పరిశ్రమ లోని పెద్దలు.
అది తప్పని ప్రభుత్వం చెప్పట్లేదు. పైపెచ్చు వాళ్ళకి వంతపాడుతుంది. ఒక బలహీనుడు , బలవంతుని మధ్య ఘర్షణ జరిగితే, మనం బలహీనుడు వైపు మాట్లాడక సైలెంట్ గా ఉన్నా, మనం బలవంతుడు వైపు ఉన్నట్లే…. అలాగే ప్రభుత్వాలు సామాన్య ప్రజల వైపు లేకుండా… టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తే అది బలహీనులు దోచుకునేందుకు అవకాశం కల్పించినట్లే.
పూర్వం బెనిఫిట్ షో వేసి ఆర్థికంగా పతనమైన అభిమానుల కుటుంబాలకు, తుఫాన్, వరదల సమయంలో దెబ్బతిన్న కుటుంబాలకు , ప్రమాదాల కారణంగా కుటుంబం పెద్ద పోతే వాళ్ల కుటుంబాలకు ఆసరాగా ఉండేటందుకు బెనిఫిట్ షో వేసేవారు. ఉదయం 6 గంటలకు…సృహృద్భావ వాతావరణంలో సాగేవి. ఇప్పుడు బెనిఫిట్ షోలు, టికెట్ పెంపుదల ద్వారా వస్తున్న డబ్బు ఎక్కడికి పోతుంది అంటే…. అంతా జగన్మాయగా ఉంది.
ప్రభుత్వం నుండి ప్రభుత్వ పెద్దలు కూడా వాటా పొందుతున్నట్టుగా ఉన్నారు. దీనిని ప్రజా ప్రయోజన చట్టంగా ఎదుర్కొనే న్యాయవాదులు లేరు. రాజకీయ నాయకులు లేరు. అభిమానుల అమాయకత్వాన్ని హీరోలు, నిర్మాతలు దారుణం గా దోచుకుంటున్నారు. మొదటి రోజు సినిమా ఎవరు చూడమన్నారు అని కొంతమంది వికట ప్రశ్నలు సంధిస్తారు. ఆ అమాయకత్వాన్ని వదులుకోలేని అభాగ్యులు కుల పరంగాను, హీరో అభిమానిగాను, జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
తెర మీద నీతులు చెప్పే హీరోలు నిస్సిగ్గుగా దోచుకుంటున్నారు. వీరి ఆలోచనల మూలంగా సింగిల్ ధియేటర్ ల సంఖ్య తగ్గిపోయింది. హీరోలు వీళ్ళు కూర్చున్న కొమ్మను వీళ్ళే నరికేసుకుంటున్నారు. ఏదైనా అంటే బడ్జెట్ ఎక్కువ అయ్యింది అంటారు. మీకు బడ్జెట్ ఎక్కువ అయితే అది సామాన్య ప్రేక్షకుడి తప్పునా….. సామాన్య కుటుంబ సభ్యులు సినిమాకు వెళ్దామంటే రెండు వేల రూపాయలు అవుతున్నాయి. ఆ మాత్రం పెట్టలేరా అనే కడుపు నిండిన నిర్మాతలు, నిర్లజ్జగా అడుగుతుంటే…. కడుపు మండిన ప్రేక్షకుడు “ఐ బొమ్మ” రవి లాంటి వాళ్ళకి జై కొడతారు.
లవకుశ, మాయ బజార్, లాంటి సినమా తీసే వాళ్ళు లేరు…. అలాంటి నటన, ఉచ్చారణ, దుర్భిణీ పెట్టి వెదికినా నటించే హీరోలు లేరు ఇప్పుడు. ముమ్మాటికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చి , ప్రజలను, వాళ్ళ అమాయకత్వాన్ని దోచుకునేందుకు అవకాశం ఇస్తున్న ప్రభుత్వం నదే తప్పు అంటున్నారు…. సోషల్ మీడియా లో నెటిజన్లు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజల వైపు నుండి ఆలోచిస్తే ఇటువంటి దోపిడీలను అరికట్టి, ప్రీమియర్ షో లను నిషేధిస్తే…. “పుష్ప 2” కి జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చు అని అంటున్నారు సినీ విశ్లేషకులు.