సినిమా వార్తలు

ఆస్కార్ ఎంట్రీ లిస్టులో ‘మహావతార్ నరసింహ’, ‘కాంతారా: చాప్టర్ 1’… భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు

Published by
Srinivas

2025లో విడుదలై ఘన విజయం సాధించిన ‘మహావతార్ నరసింహ’ మరియు ‘కాంతారా: చాప్టర్ 1’ చిత్రాలు అధికారికంగా ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్లో చోటు దక్కించుకుని భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాయి. కథా బలం, సాంస్కృతిక ప్రామాణికత, సాంకేతిక ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఈ రెండు చిత్రాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి అవార్డుల వేదికపై అడుగుపెట్టాయి.

రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన Kantara: Chapter 1 భారతీయ సంప్రదాయాలు, లోకకథల నేపథ్యాన్ని శక్తివంతమైన కథనంతో ఆవిష్కరిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు, అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన Mahavatar Narasimha పురాణ గాథను ఆధునిక విజువల్ టెక్నాలజీతో మేళవించి, అద్భుతమైన విజువల్ గ్రాండియర్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ రెండు చిత్రాలు ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్టులోకి రావడం ద్వారా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే/రచన, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ వంటి ప్రధాన విభాగాల్లో అకాడమీ అవార్డ్స్ పరిశీలనకు అర్హత సాధించాయి.

ముఖ్యంగా, ఈ ఏడాది ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కించుకున్న ఐదు భారతీయ సినిమాల్లో రెండు ఈ చిత్రాలు ఉండటం విశేషం. ఇది భారతీయ కథనాల బలం, సాంస్కృతిక వైవిధ్యం, సృజనాత్మకతకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపుగా నిలుస్తోంది.

ఇదే సందర్భంలో, ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాల వెనుక నిలిచిన ప్రముఖ నిర్మాణ సంస్థ Hombale Films పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. శక్తివంతమైన కథలకు అండగా నిలవడం, కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వడం వంటివి హోంబాలే ఫిల్మ్స్ ప్రయత్నిస్తోంది.

Srinivas