కొంతమందికి మైక్ పట్టుకోగానే మైకాసురులు లా తయారు అవుతున్నారు. మొన్న దండోరా సినిమా ఫంక్షన్ వేదిక మీద హీరో శివాజీ మాట్లాడిన మాటలు సమాజానికి, మహిళల జాగ్రత్త కోసం మాట్లాడిన మాటల సందర్భంలో రెండు తప్పుడు మాటలు దోర్లాయి… తెలుగు రాష్ట్రాల్లో చాలా వైరల్ అయ్యాయి… ఇప్పుడు కూడా అదే హీరో కి చెందిన సినిమా ఫంక్షన్లో… ఈ కోవలోనే నిర్మాత, పంపిణీదారుడు వంశీ నందిపాటి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
శివాజీ హీరోగా నటిస్తూ, స్వీయ నిర్మాణంలో రూపొందించిన క్రైమ్ కామెడీ మూవీ ‘ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ’. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ కథానాయికగా నటించారు. ఈటీవీ విన్ సంస్థ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మార్చి 6న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
వంశీ నందపాటి, బన్నీ వాసు కలసి ఈ “సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని” సినిమాని తమ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . ఇక్కడ వరకు బాగానే ఉంది. లయను పొగడాలని భావించడం తప్పులేదు… ఇటువంటి ఫంక్షన్స్ పెట్టేదే అందుకు… “నీవు నా వీపు గోకు… నేను నీ వీపు గోకుతా” అన్నట్లుగానే ఉంటున్నాయి. ఈ మధ్య సినిమా ఫంక్షన్స్…. అదే ధోరణిలో వంశీ నందిపాటి మాట్లాడుతూ లయ గారు… “నందుల ని పందుల్లా పెంచిందని” వ్యాఖ్యానించడం నిజంగా దురదృష్టకరం.
నంది అవార్డ్ కోసం ఎదురు చూసే వారు ఆర్టిస్టులు, ప్రభుత్వం ఇచ్చే అటువంటి ప్రతిష్టాత్మక మైన అవార్డ్ ను పట్టుకుని అలా వ్యాఖ్యానిస్తే, ఏమనుకోవాలి… ప్రభుత్యం ఇచ్చే అవార్డ్ ను పందులతో పోల్చడం నిజంగా దురదృష్టకరం. “ఎక్కడైనా పంది బలిస్తే నంది కాదు” అని పోలుస్తారు. ఇదెక్కడి పోలిక… వేదిక క్రింద ఉన్నప్పుడు మీరు ఎన్నైనా మాట్లాడండి…. అది మీ వ్యక్తిగతం. వేదిక ఎక్కిన తరువాత మీలో సభా సంస్కారం అనేది ఉండాలిగా…. అసురత్వం ఆవహించి కొంతమంది మైకాసురులులా తయారు అవుతున్నారు. అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా ఆలోచించి వేదిక మీద ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో వంశీ నందిపాటి క్షమాపణ చెబితే, ప్రభుత్వం ఇచ్చే అవార్డులను గౌరవించినట్టుగా భావించాలి అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీ ఎంతోమంది ని చూసింది, ముందు ముందు కూడా చూస్తుంది. మనం ముదుసలి వాళ్ళం అవుతాము కాని, సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కుతూ నిత్య యవ్వనం తో ఉంటుంది. దానికి అనుగుణంగా ఉన్నవారు, ఒక ఎన్టీఆర్, ఎఎన్ఆర్, చిరంజీవి,దాసరి నారాయణరావు, D. రామానాయుడు, లా ముద్ర వేసుకుంటారు.
లేకపోతే అనేకమందిలా కాలం తనలో కలిపేసుకుంటుంది. వేదిక ఎక్కేముందు వీళ్ళని గుర్తు పెట్టుకుంటే మీరు నాలుగు కాలాల పాటు ప్రజల మదిలో ఉంటారు. అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.