
కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న సినిమా టాక్సిక్ చుట్టూ అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ కొంతకాలంగా యష్ తదుపరి చిత్రం “టాక్సిక్” గురించి పలురకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. రానున్న సమ్మర్ లో రిలీజ్ కానున్న కొన్నిపెద్ద సినిమాలు ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభించగా, “టాక్సిక్” నుంచి ఎలాంటి అప్డేట్లు రాకపోవడంతో ఇది మార్చి 2026 విడుదలవుతుందా.. అన్న సందేహాలు వినిపించాయి.
అయితే ఇప్పుడు ‘టాక్సిక్’ టీమ్ అధికారికంగా స్పష్టత ఇచ్చింది. కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ “100 డేస్ టు టాక్సిక్” అని ప్రకటించింది. అంటే చిత్రం మార్చిలో థియేటర్లలోకి రాబోతోందన్న మాట. పోస్టర్‌లో యష్ రక్తంతో చిందర వందరగా ఉన్న బాత్‌టబ్‌లో వీపు చూపిస్తూ కూర్చున్న తీరు ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. యాష్ కూడా దీన్ని షేర్ చేస్తూ “ది ఫెయిరీటేల్ అన్‌ఫోల్డ్స్ ఇన్ 100 డేస్” అని రాసాడు.
గీతు మొహండాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే ప్రమోషన్లు జనవరి నుంచి సీరియస్‌గా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముఖ్య పాత్రలలో రుక్మిణి వసంత్, కియరా అద్వానీ, నయనతార, హూమా ఖురేషీ, తారా సుతారియా కనిపించబోతుండటం ఈ ప్రాజెక్ట్‌ను మరింత పెద్దదిగా నిలబెడుతోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారనేది మరో విశేషం.
పాటలకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను రవి బస్రూర్ సమకూర్చుతున్నట్టు తెలుస్తోంది.
చిత్రం పూర్తి టైటిల్ “Toxic: A Fairytale for Grown-Ups” – ఇది పెద్దల కోసం రూపొందించిన ఒక చీకటి కథ, స్టైల్, యాక్షన్, హై ఇంటెన్సిటీతో నిండిన ప్రపంచాన్ని చూపించబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
