యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ గత ఏడాది విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పవర్‌ఫుల్ యాక్షన్, మాస్ ఎమోషన్ మేళవింపుతో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ₹428 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ బాక్సాఫీస్‌లోనూ ఒక మైలురాయిగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ – ₹74.2 కోట్లు
కర్ణాటక – ₹10.5 కోట్లు
తమిళనాడు – ₹2.1 కోట్లు
కేరళ – ₹0.60 కోట్లు
రెస్టాఫ్ ఇండియా (ROI) – ₹10.4 కోట్లు
ఓవర్సీస్ – ₹43.78 కోట్లు
మొత్తం ప్రపంచవ్యాప్తంగా ‘దేవర’ వసూలు చేసిన గ్రాస్ కలెక్షన్ ₹428 కోట్లు.
సినిమా విడుదలైన సమయంలోనే “దేవర”కి సీక్వెల్ ఉంటుందని ప్రకటించినప్పటికీ, అప్పటి నుంచి ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వారి నిరీక్షణకు ముగింపు పలుకుతూ చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కీలక ప్రకటన విడుదల చేసింది.
‘దేవర’ విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థ ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకుంది. “దేవర తాండవానికి ఏడాది పూర్తయింది. దేవర 2 కోసం సిద్ధంకండి” అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
“ప్రతి తీరాన్ని వణికిస్తూ అలజడి సృష్టించి సంవత్సరం గడిచింది. అప్పటి నుంచి ప్రపంచం గుర్తుంచుకున్న పేరు దేవర. అది భయంతో అయినా, ప్రేమతో అయినా వీధులు ఎప్పటికీ మర్చిపోవు. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర 2 కోసం సిద్ధం అవ్వండి. అతి త్వరలో మరిన్ని అప్‌డేట్స్ మీ ముందుకు వస్తాయి” అని.
ఈ ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానుల్లో హర్షం వెల్లివిరుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో #Devara2 హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. త్వరలో రాబోయే అప్డేట్‌లతో సీక్వెల్‌పై హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.