ఆంధ్ర ప్రదేశ్

మీ స్టయిల్లో ఒకసారి చెప్పండి… పవన్ కళ్యాణ్‌కి ఏపీ డిప్యూటీ స్పీకర్ రిక్వెస్ట్

Published by
Srinivas

ఈరోజు శాసనసభలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. కేరళలో అమలు చేస్తున్న ప్లాస్టిక్ నిషేధ విధానాన్ని ప్రస్తావిస్తూ, మన రాష్ట్రంలో కూడా ఆ విధానం అనుసరించవచ్చని ఆయన సూచించారు.

కేరళ మోడల్ ప్రస్తావన

రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ – “కేరళలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. అక్కడ ప్లాస్టిక్ బదులుగా గాజు సీసాలు వాడుతున్నారు. ఒక గాజు సీసా కొనుగోలు చేసినప్పుడు 10 రూపాయల అదనపు ఛార్జ్ తీసుకుంటారు. ఆ సీసాను తిరిగి ఇచ్చేసరికి ఆ 10 రూపాయలను మళ్లీ కస్టమర్‌కి తిరిగి ఇస్తారు. ఈ విధానం చాలా బాగా పనిచేస్తోంది” అని తెలిపారు.

పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేక రిక్వెస్ట్

అంతేకాకుండా, హీరోలతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పారు. “అయితే మీరు (డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్) మీ స్టయిల్‌లో ఒకేసారి ప్లాస్టిక్ నిషేధంపై చెప్పండి. మీరు చెబితే ప్రజల్లో వెంటనే ప్రభావం ఉంటుంది, అదీ ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా జరుగుతుంది” అని రఘురామ కృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.

పాజిటివ్ రెస్పాన్స్

ఈ సూచనపై సభలో పవన్ కళ్యాణ్ తో పాటు, సభ్యులు కూడా సమ్మతం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధంపై కఠిన చర్యలు తీసుకోవడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts