
నందమూరి కుటుంబం తరఫున ఒక సన్నివేశం సోషల్ మీడియాలో హైలైట్‌గా మారింది. యంగ్ ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు ఇటీవల నార్నే నితిన్ వివాహం లో అందరి దృష్టిని ఆకర్షించారు. మేనమామ వివాహం కావడంతో, ఇద్దరు కొడుకులు ప్రత్యేకంగా నిలిచారు.
పెళ్లి వేడుకలో వీరి స్టైలిష్ లుక్ మీడియా ఫోటోలు మరియు వీడియోల్లో స్పాట్‌లైట్‌గా నిలిచాయి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వద్ద కూర్చుని దిగిన ఫోటోలు, సరదాగా ఆడుకుంటున్న క్యూట్ షాట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. నెట్టింట అభిమానులు వీరి ఫోటోలు, వీడియోలను తెగ పంచుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా రిసెప్షన్ వేడుకలో కూడా అభయ్, భార్గవ్‌లు స్టైలిష్ లుక్‌లో కనిపించారు. తల్లి లక్ష్మి ప్రణతి సైతం స్టైలిష్ అండ్ ఎలిగెంట్ గా రిసెప్షన్‌లో హాజరయ్యారు. కొడుకులతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు తల్లి ఎత్తుకు దగ్గరగా పెరిగాడు. ఈ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ “కళ్లకు పండుగలా ఉంది” అని కామెంట్స్ చేస్తున్నారు.
తల్లికొడుకుల ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హీట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ కిడ్స్ స్పెషల్ హైలైట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
