Download App

‘కాంతార: చాప్టర్ 1’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్

సెప్టెంబర్ 27, 2025 By Rahul N
రిషబ్ శెట్టి (Rishab Shetty) కాంతార (Kantara) బాక్సఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ అవడంతో పార్ట్ 2 కి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ విజయానికి ప్రీక్వెల్‌గా “కాంతార: చాప్టర్ 1” (Kantara: Chapter-1) తీసుకువస్తున్నారు రిషబ్ శెట్టి. ఈ...
'కాంతార: చాప్టర్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్

రిషబ్ శెట్టి (Rishab Shetty) కాంతార (Kantara) బాక్సఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ అవడంతో పార్ట్ 2 కి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ విజయానికి ప్రీక్వెల్‌గా “కాంతార: చాప్టర్ 1” (Kantara: Chapter-1) తీసుకువస్తున్నారు రిషబ్ శెట్టి. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి స్వయంగా కథ, దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్, అక్టోబర్ 2న దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషల్లో సంచలనం సృష్టించింది. రా అండ్ రస్టిక్ నేటివ్ టచ్‌తో పాటు, మైథాలజీ మరియు రీజినల్ ట్రెడిషన్స్ కలగలిపిన రిషబ్ శెట్టి మైండ్-బ్లోయింగ్ ప్రెజెంటేషన్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది.

NTR to attend Kantara Chapter 1 Pre Release event

హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్

సినిమా హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకు, టీమ్ సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో పెద్ద ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. అంతే కాకుండా ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హాజరవుతున్నారు. ఎన్టీఆర్ ప్రెజెన్స్ సినిమా ప్రమోషన్‌కి అపారమైన బలాన్ని చేకూర్చనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

పండుగ సీజన్‌లో పెద్ద ఎట్రాక్షన్

రిజినల్ కల్చర్, మైథాలజీ కలగలిపి అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించబోతున్న “కాంతార: చాప్టర్ 1” కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 2న దసరా కానుకగా రానున్న ఈ చిత్రం, ఈ ఫెస్టివల్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఎట్రాక్షన్గా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading