Download App

వర్షం ఆపలేదు పవర్ స్టార్ క్రేజ్.. ‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉర్రూతలూగిపోయిన ఫాన్స్

సెప్టెంబర్ 21, 2025 By Rahul N
హైదరాబాద్ వేదికపై ఈరోజు సాయంత్రం ఒక మాస్ హంగామా జరిగింది. అదే ‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలుపెరగని జోష్‌తో వేలాదిగా తరలి వచ్చి వేదికను కిక్కిరిసేలా నింపేశారు. మొదట చిన్న చినుకులు.. తర్వాత కురిసిన భారీ వర్షం కూడా వారి ప్యాషన్‌ను ఏమాత్రం...
వర్షం ఆపలేదు పవర్ స్టార్ క్రేజ్.. ‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉర్రూతలూగిపోయిన ఫాన్స్

హైదరాబాద్ వేదికపై ఈరోజు సాయంత్రం ఒక మాస్ హంగామా జరిగింది. అదే ‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలుపెరగని జోష్‌తో వేలాదిగా తరలి వచ్చి వేదికను కిక్కిరిసేలా నింపేశారు. మొదట చిన్న చినుకులు.. తర్వాత కురిసిన భారీ వర్షం కూడా వారి ప్యాషన్‌ను ఏమాత్రం ఆపలేదు. తడిసి ముద్దవుతూ కూడా తమ ఫేవరెట్ హీరో కోసం అభిమానులు అక్కడినుండి కదల్లేదు.

ఈ వేడుకలో అసలైన హైలైట్ మాత్రం పవర్ స్టార్ ఎంట్రీ. ఖడ్గం పట్టుకుని OG గెటప్ లో స్టేజీ మీద అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ను చూసి అభిమానుల్లో గూస్‌బంప్స్ పుట్టాయి. “పవర్ స్టార్”, OG అంటూ అరుపులు, జనసేన జెండాలు ఊపుతూ వేదిక మొత్తం ఒక పండుగ వాతావరణం సృష్టించారు.

ఇంకా అభిమానులకు సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిన మాటలు అక్కడ అలజడి రేపాయి. “వర్షం మనల్ని ఆపుద్దా” అంటూ తనపై ఉన్న గొడుగులను తీసేసి, సెక్యూరిటీని పక్కకు నెట్టి.. వర్షంలో తడుస్తూ అభిమానుల మధ్య నిలబడ్డారు. ఆ క్షణంలో వేదిక మొత్తం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది.

అంతేకాదు, ఆయన తెలుగు, జపనీస్ భాషల్లో ‘OG’ డైలాగ్స్ చెబుతూ మాస్ వైబ్స్‌ను డబుల్ చేశారు. ఆ డైలాగ్స్ విన్న ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోయారు.

వర్షంలో తడుస్తూనే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎంట్రీ, ఆయన చెప్పిన మాటలు, డైలాగ్స్—అన్నికలిసి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మరపురాని మాసివ్ సెలబ్రేషన్‌గా మార్చేశాయి. అభిమానులు మాత్రం ఒక్క మాటే అంటున్నారు – “ఇదే పవర్ స్టార్.. ఇదే మా జోష్!”

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading