Download App

OG నుండి మరో సర్ప్రైజ్.. పవన్ ఫాన్స్ కి పండగే!

సెప్టెంబర్ 1, 2025 • By Srinivas
జనసేన అధినేత, పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా స్టైలిష్ లుక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ పవన్‌ను ఓ కొత్త లుక్‌లో, మరింత స్టైలిష్‌గా అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు....
OG నుండి మరో సర్ప్రైజ్.. పవన్ ఫాన్స్ కి పండగే!

జనసేన అధినేత, పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా స్టైలిష్ లుక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ పవన్‌ను ఓ కొత్త లుక్‌లో, మరింత స్టైలిష్‌గా అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ పోస్టర్‌తో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫైర్ స్టార్మ్ తో దుమ్ము రేపిన They Call Him OG నుండి రానున్న సర్ప్రైజ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ తాజాగా కీలక ప్రకటన చేసింది. రేపు సాయంత్రం 4:05 గంటలకు అంటూ ఒక హింట్ ఇచ్చి వదిలేసింది. అయితే అది గ్లింప్స్ అవుతుందా? టీజర్ అవుతుందా? లిరికల్ సాంగ్ అవుతుందా? లేక మరొక పోస్టర్ మాత్రమేనా? అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది.

“OG” చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ భారీ సినిమా సెప్టెంబర్ 25, 2025న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. సుజీత్ ప్రత్యేక శైలి, పవన్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, థమన్ సంగీతం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌లో వేగం పెంచుకుంది. పవన్ మాస్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించే డైలాగ్స్, స్టైల్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో “OG” బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి.

మొత్తం మీద పవన్ కళ్యాణ్ అభిమానులు వరుసగా రెండు భారీ ప్రాజెక్టుల నుండి అప్‌డేట్‌లు అందుకుంటూ జశ్న్ మోడ్‌లోకి వెళ్లారు. రేపటి 4:05 గంటల సర్ప్రైజ్ అప్‌డేట్‌తో పవర్ స్టార్ ఫీవర్ మరింతగా పెరగడం ఖాయం.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts