సినిమా వార్తలు

డెత్ కోటా… కన్ఫర్మ్ అంట!: ‘OG’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Published by
Srinivas

పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘OG’ ట్రైలర్‌కు చివరికి రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. “డెత్ కోటా… కన్ఫర్మ్ అంట!” అంటూ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్‌ 21న ట్రైలర్‌ విడుదల కానున్నట్లు తెలిపారు. దీంతో పవన్ అభిమానుల్లో పట్టరాని ఆనందంలో మునిగిపోయారు.

ఇటీవల ‘They Call Him OG’ నుంచి బయటకు వచ్చిన రెండు క్రేజీ స్టిల్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. గ్లింప్స్‌లో చూపించిన పవన్ కళ్యాణ్ అవుట్‌ఫిట్స్, లుక్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయన స్టైల్, మాసివ్‌ ప్రెజెన్స్ చూసి అభిమానులు ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఫైర్‌ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు. “మామూలుగా లేవు” అంటూ కామెంట్లతో ఫీడ్ నిండిపోయింది.

ఇక పాటల విషయానికి వస్తే – ఇప్పటికే రిలీజ్‌ చేసిన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ సాంగ్‌, ‘గన్స్ ఎన్ రోజెస్’ సింగిల్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యూత్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో మ్యూజిక్‌ ఆల్రెడీ హైప్‌ క్రియేట్‌ చేసింది. ఈ సింగిల్స్ విజయవంతం కావడంతో ట్రైలర్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో పవన్‌ కళ్యాణ్‌ను ఒక రగ్గడ్‌ అవతారంలో చూడబోతున్నారని టాక్‌. DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్‌ డేట్ ఖరారవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ – “సెప్టెంబర్‌ 21కి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌” అని!

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.