పవన్ కళ్యాణ్ They Call Him OG ప్రీమియర్లతోనే సోషల్ మీడియా వేడెక్కింది. ట్విట్టర్‌లో #TheyCallHimOG ట్రెండింగ్‌లో దూసుకుపోతూ అభిమానులు పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ అవతారాన్ని ఆరాధిస్తున్నారు. “పవర్‌స్టార్ కి సరిపోయే మాస్ ఎంట్రీ,” “ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్స్, సెకండ్ హాఫ్ లో ఆక్షన్ పర్వం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎక్కడ చూసినా OG డైలాగ్స్, ఎంట్రీ సీన్స్ గురించే చర్చ జరుగుతోంది.
థమన్ సంగీతం, సుజీత్ స్టైలిష్ టేకింగ్, ఎమ్రాన్ హష్మీ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ స్క్రీన్‌పై హైలైట్ అవుతోందని రివ్యూల్లో కనిపిస్తోంది. కొందరు కథనం వేగం విషయంలో మిక్స్‌డ్ కామెంట్స్ చేసినా, మొత్తం మీద అభిమానులు OGని “పవన్ కెరీర్‌లో మరో మాస్ ఫెస్టివల్”గా అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ క్రియేట్ అవుతోంది.