సినిమా వార్తలు

అభిమానుల్లో జోష్ పెంచుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త పోస్టర్

Published by
Rahul N

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో అభిమానుల్లో సందడి నింపుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన OG చిత్రం ప్రీ రిలీజ్ బుకింగ్స్‌ USA లో రికార్డులు బద్దలవుతున్నాయి.

ఇదిలా ఉంటే, గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత పవన్ కళ్యాణ్–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. త్రీ పీస్ సూట్, టోపీతో సంపూర్ణ నల్లటి దుస్తులు ధరించిన పవన్ కళ్యాణ్ అద్భుతమైన స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ స్వాగ్, ప్రత్యేకమైన స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకం. తాజా పోస్టర్‌ ద్వారా హరీష్ శంకర్ ఆయన ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేశారు.

ఈ సినిమా కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు పాల్గొంటారు. రాబోయే షెడ్యూల్‌తో టాకీ భాగం దాదాపు పూర్తవుతుందని చిత్రబృందం తెలిపింది.

ఉస్తాద్ భగత్ సింగ్ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మాస్ ప్రేక్షకులు, యాక్షన్ అభిమానులు మెచ్చేలా చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పనిచేస్తోంది.

Rahul N

Recent Posts

  • సినిమా వార్తలు

హీరోయిన్లతో రూమర్స్… భయపడిన నాగవంశీ?

నవంబర్ 17, 2026