ఓటిటి న్యూస్

Cult OTT: ఓటీటీలోకి విశ్వక్ సేన్ కల్ట్… పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్

Published by
Satya Pulagam

Vishwak Sen Cult OTT Streaming Platform: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ENE 2 (ఈ నగరానికి ఏమైంది 2) ఈ రోజు (నవంబర్ 19న) థియేటర్లలో విడుదల అయ్యింది. ఇవాళే ఆయన డైరెక్ట్ చేసిన సినిమా ఓటీటీలోకి వచ్చింది. పాన్ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రైమ్ వీడియోలో విశ్వక్ సేన్ కల్ట్!

Cult Movie Streaming Now On Prime Video: విశ్వక్ సేన్ హీరోగా నటించడంతో పాటు డైరెక్ట్ చేసిన మూవీ కల్ట్. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైంది. టీజర్, ట్రైలర్లు సినిమాపై హైప్ పెంచాయి. నెట్ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ స్క్విడ్ గేమ్ టైపులో ఉంటుందని ఆడియన్స్ ఆశించారు. అయితే వయలెన్స్ ఎక్కువ, విషయం తక్కువ అని రిజెక్ట్ చేశారు. దాంతో థియేటర్లలో విడుదలైన 20 రోజులకు ఓటీటీలోకి వచ్చింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో కల్ట్ స్ట్రీమింగ్ అవుతోంది. పాన్ ఇండియా భాషల్లో డిజిటల్ వీక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో కన్నడ, మలయాళ భాషలలో కూడా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలోకి ENE Repeat వచ్చిన రోజునే కల్ట్ సినిమాను ఓటీటీలోకి తీసుకు రావడం విశేషం.

దర్శకుడిగా ఫలక్ నుమా దాస్ మూవీతో విశ్వక్ సేన్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా ఆడియన్స్ కి కూడా నచ్చింది. అయితే కల్ట్ సినిమా ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడం సంగతి అటుంచితే యావరేజ్ కూడా కాలేదు. ఈ సినిమాలో మురళీ శర్మ, తారక్ పొన్నప్ప, గాయత్రి భరద్వాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ యాక్ట్ చేశారు. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

కల్ట్ మూవీ రివ్యూ చదవండి

Satya Pulagam

Recent Posts

  • సినిమా వార్తలు

హీరోయిన్లతో రూమర్స్… భయపడిన నాగవంశీ?

నవంబర్ 17, 2026